Thalapathy Vijay: TVK పార్టీ అధినేత విజయ్‌కు CBI నోటీసులు

Thalapathy Vijay: TVK పార్టీ అధినేత విజయ్‌కు CBI నోటీసులు
x

Thalapathy Vijay: TVK పార్టీ అధినేత విజయ్‌కు CBI నోటీసులు 

Highlights

CBI Notices to TVK Chief Vijay: TVK పార్టీ అధినేత విజయ్‌కు CBI నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది.

CBI Notices to TVK Chief Vijay: TVK పార్టీ అధినేత విజయ్‌కు CBI నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరూర్ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు విజయ్‌ను విచారణకు రావాలని కోరుతూ నోటీసులు పంపారు.

నోటీసులపై స్పందించిన విజయ్, అధికారులకు లిఖితపూర్వక సమాధానం పంపారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్, ఇతర కారణాల వల్ల మంగళవారం జరగాల్సిన విచారణకు హాజరు కాలేనని విజయ్ స్పష్టం చేశారు. విచారణకు సిద్ధమవ్వడానికి, హాజరు కావడానికి తనకు కనీసం 10 రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. గడువు ముగిసిన తర్వాత విచారణకు తప్పకుండా హాజరవుతానని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. విజయ్ అభ్యర్థనపై సీబీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. విజయ్ కోరిన 10 రోజుల గడువును పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories