CBSE Date Sheet 2025 : CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇదే..డౌన్ లోడ్ చేసుకోండిలా

CBSE Date Sheet 2025 : CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇదే..డౌన్ లోడ్ చేసుకోండిలా
x

CBSE Date Sheet 2025 : CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇదే..డౌన్ లోడ్ చేసుకోండిలా

Highlights

CBSE Date Sheet 2025: సీబీఎస్ఈ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షల కోసం సీబీఎస్ఈ డేట్ షీట్ 2025 రిలీజ్ అయ్యింది.

CBSE Date Sheet 2025 : సీబీఎస్ఈ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది. పదవ తరగతి, 12వ తరగతి పరీక్షల కోసం సీబీఎస్ఈ డేట్ షీట్ 2025 రిలీజ్ అయ్యింది. ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు cbse.govలో పూర్తి డేట్ షీట్ ను చెక్ చేసుకోవచ్చు. అధికారిక డేట్ షీట్ వివరాల ప్రకారం..పదవ తరగతి బోర్డు పరీక్ష ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 18, 2025 వరకు జరగనున్నాయి. 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 4, 2025న ముగుస్తాయి.

సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ డేట్ షీట్ ప్రకారం రెండు తరగతుల్లోని విద్యార్థులకు సాధారణంగా అందించే సబ్జెక్టుల మధ్య గ్యాప్ కూడా ఇచ్చారు. ఒకే విద్యార్థికి రెండు సబ్జెక్జు పరీక్షలు ఒకే తేదీన రాకుండా డేట్ షీట్ ను తయారు చేశారు. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30వరకు జరగనున్నాయి. అయితే పరీక్షల వ్యవధి సబ్జెక్టుల ఆధారంగా మారుతాయి. సబ్జెక్ట్ అవసరాలకు అనుగుణంగా 2 లేదా 3 గంటలు ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్ వంటివాటికి 3గంటల వ్యవధ ఉంటుంది. టూరిజం, డ్యాన్స్ వంటి ప్రత్యేక సబ్జెక్టులకు 2గంటల సమయం ఇస్తారు.

10, 12వ తరగతికి సంబంధించిన సీబీఎస్ఈ డేట్ షీట్ 2025ను డౌన్ లడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ దశలను ఫాలో అవ్వండి.

1. ముందుగా cbse.gov.in సీబీఎస్ఈ వెబ్ సైట్లోకి వెళ్లాలి.

2. హోం పేజీలో అందుబాటులో ఉన్న 10, 12వ తరగతి కోసం సీబీఎస్ఈ డేట్ షీట్ 2025పై క్లిక్ చేయాలి.

3. తేదీలను చెక్ చేసే పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.

4. పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాతి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఇక మనదేశం నుంచే కాకుండా విదేశాల్లోని 8వేల పాఠశాలల నుంచి సుమారు 44లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది 10,12వ తరగతుల బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు. మొదటిసారిగా దాదాపు పరీక్షలకు 86రోజుల ముందు సీబీఎస్ఈ డేట్ షీట్స్ రిలీజ్ చేసింది. సీబీఎస్ఈ ప్రతీ విద్యార్థికి అడ్మిట్ కార్డు నిర్ణీత సమయంలో రిలీజ్ చేస్తుంది. విద్యార్థికి సంబంధించిన నిర్దిష్ట సబ్జెక్టుల పరీక్ష తేదీ అందులో ఉంటుందని పేర్కొంటారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories