Social Media New Policy: సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్ పెడితే ఇక కఠిన చర్యలే.. కేంద్ర ప్రభుత్వం

Centre to Block Anti-National Content and Social Media Posts with New Policy
x

Social Media New Policy: సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్ పెడితే ఇక కఠిన చర్యలే.. కేంద్ర ప్రభుత్వం

Highlights

Social Media New Policy: సోషల్ మీడియాలో దేశంపై ద్వేషాన్ని వ్యక్తం పరుస్తూ ఏదైనా పోస్ట్ పెట్టారో.. ఇక అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

Social Media New Policy: సోషల్ మీడియాలో దేశంపై ద్వేషాన్ని వ్యక్తం పరుస్తూ ఏదైనా పోస్ట్ పెట్టారో.. ఇక అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దేశాన్ని వ్యతిరేకస్తూ వచ్చే పోస్టుల్లో మెసేజులున్నా.. వీడియోలున్నా వాటిఇన పోస్ట్ చేసినా.. షేర్ చేసినా కూడా వారిని చట్టప్రకారం శిక్షిస్తామని, దీనికోసం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నామని తెలిపింది.

ఈ మధ్య కాలంలో దేశంపై కామెంట్ చేయడం ఫ్యాషన్‌గా కొంతమందికి మారిపోయింది. దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై స్పదిస్తూ దేశాన్నే వ్యతిరేకుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురానుంది. ఇక నుంచి సోషల్ మీడియాలో దేశంపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఏ పోస్ట్ అయినా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. దీనికోసం ప్రత్యేకమైన విధానాని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇటీవల దేశానికి వ్యతిరేకంగా చాలా వెబ్ సైట్‌లలో కంటెంట్‌ను అప్‌ లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా పహల్గామ్‌లో ఉగ్రవాది దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో సోషల్ మీడియాలో దేశానికి వ్యతిరేకంగా కొంతమంది పోస్టులు పెట్టారు. ఇలాంటి పోస్టులు పెట్టే వ్యక్తులు ఇక నుంచి చట్టం నుండి తప్పించుకోలేరు. దేశంలో ఎక్కడ ఏ మూలన దాక్కున్నా పట్టుకొచ్చి మరీ శిక్షిస్తామని హోం శాఖ చెబుతోంది. దేశంపై వ్యతిరేకంగా ఏ విధమైన పోస్ట్ వచ్చినా .. వెంటనే దానికి సంబంధించిన వెబ్ సైట్ లేదా ఐడిలు బ్లాక్ చేయబడతాయి. ఇక ఆ పోస్ట్‌ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. దీనికోసం ఒక ప్రత్యేకమైన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం చూస్తోంది. దీనికోసం సీబీఐ, ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసులు, అంతర్గత భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు ఇదే వ్యూహంపై పనిచేస్తున్నాయి. త్వరలోనే ఇది అమలు చేయాలని చూస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories