లొంగిపోయిన సహచరులపై మావోయిస్టుల సంచలన వీడియో

లొంగిపోయిన సహచరులపై మావోయిస్టుల సంచలన వీడియో
x

లొంగిపోయిన సహచరులపై మావోయిస్టుల సంచలన వీడియో

Highlights

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మావోయిస్టులు సంచలన వీడియో విడుదల చేశారు. దానిలో లొంగిపోయిన తమ సహచరులను నిందించారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మావోయిస్టులు సంచలన వీడియో విడుదల చేశారు. దానిలో లొంగిపోయిన తమ సహచరులను నిందించారు. పార్టీని, ప్రజలను మోసం చేయడం ద్వారా మావోయిస్టుల అంతానికి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని భైరామ్‌గఢ్ ఏరియాకు చెందిన ఇద్దరు క్రియాశీల నక్సలైట్లు అక్టోబర్ 26న పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. నాటి నుండి నక్సలైట్ సంస్థలలో గందరగోళం నెలకొంది. ఇదే నేపధ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయిన తమ సహచరులకు వ్యతిరేకంగా గోండి మాండలికంలో ఒక వీడియోను విడుదల చేశారు.


ఈ వీడియో లొంగిపోయిన నక్సలైట్లను దేశద్రోహులుగా అభివర్ణించారు. పార్టీని, ప్రజలను మోసం చేసి, ఇప్పుడు తమపై ఎదురుతిరిగి, తమ జనతా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లొంగిపోయిన మావోయిస్టులు మిగిలిన మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని, తమ స్మారక చిహ్నాలను ధ్వంసం చేస్తున్నారని, సంస్థను రెండు వర్గాలుగా విభజిస్తూ, మావోయిస్టు భావజాలం ముగింపు గురించి మాట్లాడుతున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories