Delhi Police: మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై వివాదం: పెంగ్విన్ సంస్థకు ఢిల్లీ పోలీసుల నోటీసులు!

Delhi Police: మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై వివాదం: పెంగ్విన్ సంస్థకు ఢిల్లీ పోలీసుల నోటీసులు!
x
Highlights

Delhi Police: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఆత్మకథ ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా పెను దుమారాన్ని రేపుతోంది.

Delhi Police: భారత సైన్యం మాజీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఆత్మకథ ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా పెను దుమారాన్ని రేపుతోంది. ఈ పుస్తక ప్రచురణకర్త అయిన పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌజ్‌ ఇండియా (PRHI)కు ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

విచారణకు హాజరుకావాలని ఆదేశం:

పుస్తక ప్రచురణకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ప్రచురణ సంస్థ యాజమాన్యం విచారణకు హాజరుకావాలని పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రధానంగా: ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాని ఈ పుస్తకంలోని అంశాలు ఎలా బయటకు వచ్చాయి? ప్రభుత్వ అనుమతి రాకముందే ఈ పుస్తకాన్ని ఎలా సిద్ధం చేశారు? వంటి పలు కీలక ప్రశ్నలకు వివరణ కోరారు.

అసలు వివాదం ఏమిటి?

సైన్యంలో ఉన్నత హోదాల్లో పనిచేసిన వారు తమ అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే, అనుమతి రాకముందే ఈ పుస్తకం బయటకు రావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పుస్తకం ఇంకా మార్కెట్‌లో అందుబాటులో లేదని, రిటైల్ వేదికల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచలేదని పెంగ్విన్ సంస్థ చెబుతోంది. మరోవైపు, ఈ పుస్తకం ఇప్పటికే మార్కెట్‌లో దొరుకుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేశాయి.

ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు ఏవైనా ఇందులో ప్రస్తావించారా అనే కోణంలోనూ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories