Covid Cases: దేశంలో పడగవిప్పుతున్న కరోనా వైరస్.. వెయ్యి దాటిన కోవిడ్ కేసులు

Coronavirus is increasing in the country Covid cases have crossed a thousand
x

Covid Cases: దేశంలో పడగవిప్పుతున్న కరోనా వైరస్.. వెయ్యి దాటిన కోవిడ్ కేసులు

Highlights

Covid Cases: దేశంలో కోవిడ్ వైరస్ నెమ్మెదిగా పడగవిప్పుతోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్...

Covid Cases: దేశంలో కోవిడ్ వైరస్ నెమ్మెదిగా పడగవిప్పుతోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య వెయ్యి దాటింది. గత వారంలో కొత్తగా 752 మంది వైరస్ బారినపడ్డారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు అధికార వర్గాలుతెలిపాయి. గత వారం రోజుల్లో కోవిడ్ సంబంధిత మరణాలు 7 సంభవించినట్లు తెలిపాయి. కేరళలో సోమవారం ఉదయం నాటికి కొత్తగా 335 మంది వైరస్ బారినపడ్డారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 430కి చేరుకుంది. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత స్థానాల్లో గుజరాత్, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.

కాగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ విస్తరణపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం రేఖా గుప్తా తెలిపారు. ప్రస్తుత కోవిడ్ వైరస్ కు చెందిన రెండు కొత్త వేరియంట్లు ఎన్ బీ, 1.8.1, ఎల్ఎఫ్.7లను దేశంలో గుర్తించామని ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఈ వేరియంట్లు ఆందోళనకరమైనవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు జరిపిన పరీక్షల్లో 53శాతం నమూనాలను కోవిడ్ 19కు చెందిన జేఎన్1 వేరియంట్ వని 26శాతం బీఏ2 వేరియంట్ వని తెలిపింది. దేశంలో కోవిడ్ విస్తరణపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారని..వైరస్ సోకిన వారందరూ స్వల్పలక్షణాలతో బాధపడుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories