15th Vice President of India: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

15th Vice President of India: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం
x

15th Vice President of India: భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

Highlights

సీపీ రాధాకృష్ణన్‌ దేశ 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు హాజరయ్యారు.

న్యూఢిల్లీ: సీపీ రాధాకృష్ణన్‌ దేశ 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు హాజరయ్యారు.

ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ తన ప్రత్యర్థి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డిని 152 ఓట్ల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఓటమి అనంతరం జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories