CRPF Jawans: జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

CRPF Vehicle Falls into Gorge in Jammu & Kashmir 3 Jawans Dead, 10 Injured
x

CRPF Jawans: జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల మృతి

Highlights

CRPF Jawans: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

CRPF Jawans: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపుర్ జిల్లాలో బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

కొందరు జవాన్లు కొండప్రాంతంలోని ఓ ప్రాంతానికి వెళ్తుండగా, వాహనం మలుపు వద్ద అదుపు తప్పింది. అదుపు కోల్పోయిన వాహనం కొండకింద ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా, మూడు మృతదేహాలు ఘటనా స్థలంలోనే గుర్తించబడినట్టు అధికారులు తెలిపారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే, స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన జవాన్లను హెలికాప్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు.

ఈ దుర్ఘటనపై కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "బసంత్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ వాహనం ప్రమాదానికి గురైన ఘటన తీవ్ర విషాదం. డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. స్థానికులు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు" అని ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా తెలియజేశారు.

పూంచ్, రాజౌరి, రాంబన్, ఉధంపుర్ వంటి జిల్లాల్లో రహదారుల పట్ల అప్రమత్తత లేకపోవడం, అధిక వేగం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ట్రాఫిక్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక ట్రాఫిక్ బృందాలను నియమించినట్టు వారు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories