Delhi Election Results 2025: కేజ్రీవాల్‌పై గెలిచిన ఈ పర్వేశ్ వర్మ ఎవరు?

Delhi Assembly Election Results 2025: Who is Parvesh Verma who defeated Arvind Kejriwal?
x

Delhi Election Results 2025: కేజ్రీవాల్ పై గెలుపు ఎవరీ పర్వేశ్ వర్మీ?

Highlights

అరవింద్ కేజ్రీవాల్ ను న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించారు. ఈ స్థానంలో కొన్ని రౌండ్లలో కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉంటే మరికొన్ని రౌండ్లలో పర్వేశ్ లీడ్ లోకి వచ్చారు.

అరవింద్ కేజ్రీవాల్ ను న్యూదిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ ఓడించారు. ఈ స్థానంలో కొన్ని రౌండ్లలో కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉంటే మరికొన్ని రౌండ్లలో పర్వేశ్ లీడ్ లోకి వచ్చారు. చివరకు పర్వేశ్ నే గెలుపు వరించింది. అరవింద్ కేజ్రీవాల్ ను 3,182 ఓట్లతో ఓడించి పర్వేశ్ జాయింట్ కిల్లర్ గా పేరొందారు. దిల్లీ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ నుంచి పర్వేశ్ సాహిబ్ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన తర్వాత ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఎవరీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ?

అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ రాజకీయ కుటుంబం నుంచి వచ్చరు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకే. పర్వేశ్ అంకుల్ ఆజాద్ సింగ్ నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా పనిచేశారు.2013లో మెహ్రౌలి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఆప్ అభ్యర్ధి నరీందర్ సింగ్ సెల్జాపై 4,564 ఓట్ల తేడాతో గెలిచారు.

2014లో పశ్చిమ దిల్లీ పార్లమెంట్ స్థానంలో గెలిచారు.ఆ ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధి జర్నైల్ సింగ్ పై ఆయన గెలిచారు.ఈ ఎన్నికల్లో ఆయనకు 2,68,586 ఓట్ల మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆయన మరోసారి ఇదే స్థానం నుంచి గెలిచారు. అప్పట్లో ఆయనకు 5,78486 ఓట్ల మెజారిటీ దక్కింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వర్మకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు.

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని పర్వేశ్ హామీ

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని పర్వేశ్ హామీ ఇచ్చారు. న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా ఆ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఎన్నికల ప్రచారంలో ఆయన ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నైపుణ్యం ఆధారంగా యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories