Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. ఫరీదాబాద్‌ మాడ్యూల్‌కు టర్కీతో లింకులు

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. ఫరీదాబాద్‌ మాడ్యూల్‌కు టర్కీతో లింకులు
x

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. ఫరీదాబాద్‌ మాడ్యూల్‌కు టర్కీతో లింకులు

Highlights

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్‌ మాడ్యూల్‌పై లోతుగా విచారణ జరపగా.. టర్కీతో లింకులు ఉన్నట్టు వెల్లడైంది. డాక్టర్ మహ్మద్ ఉమర్, ముజిమ్మిల్‌లకు టర్కీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో టర్కీలో ఉమర్, ముజిమ్మిల్‌ పర్యటించారని పేర్కొన్నారు. రెండు టెలిగ్రామ్ గ్రూపులలో ఉగ్రవాదులు జాయిన్ అవగా అందులో టర్కీ హ్యాండ్లర్లు హ్యాండిల్ చేస్తున్న గ్రూప్‌లో కశ్మీర్ ఆజాదీపై ప్రసంగాలు ఇచ్చారు.

ఈ గ్రూప్‌లోనే భారత్‌లో వివిధ ప్రాంతాలలో దాడులు చేయాలని టర్కీ హ్యాండ్లర్లు ప్లాన్ చేశారు. అందుకు తగిన డైరెక్షన్‌లను ఉగ్రవాదులు ఉమర్, ముజిమ్మిల్‌కు ఇచ్చారు. దీంతో టర్కీ లింకులు, హ్యాండ్లర్లు ఎవరనే దానిపై NIA ఫోకస్ చేసింది. మరోవైపు ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఫరీదాబాద్‌ అల్ ఫలా యూనివర్శిటీకి చెందిన వారు కావడంతో ఆ యూనివర్శిటీపై NIA నిఘా పెట్టింది. ఉగ్రవాదులకు కేంద్రంగా యూనివర్శిటీ ఎలా మారిందన్న దానిపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే NIA అధికారులు యూనివర్శిటీకి వెళ్లి ఉమర్, ముజిమ్మిల్‌కు సంబంధించిన విషయాలపై విచారించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories