Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ సహా ఎవరేమన్నారంటే?

Delhi Election Results 2025 Updates
x

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ సహా ఎవరేమన్నారంటే?

Highlights

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజాశక్తే అత్యున్నతమని, ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీ:

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రజాశక్తే అత్యున్నతమని, ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనలు విజయం సాధించాయన్నారు. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని.. ఇది తమ గ్యారెంటీ అని చెప్పారు మోడీ.


గడ్కరీ:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా భారీ విజయం సాధించామన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, తమపై విశ్వాసం ఉంచి గెలిపించిన ఢిల్లీ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. దేశ రాజధానికి కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామని.. సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోడీపై విశ్వాసం మరోసారి రుజువైందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన పవన్.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోడీ పాలన సాగిస్తారని అన్నారు. మోడీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.

కేజ్రీవాల్:

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అంగీకరిస్తున్నట్టు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బీజేపీకి అభినందనలు తెలిపిన కేజ్రీవాల్ ప్రజల ఆంకాంక్షలను ఆ పార్టీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

కాంగ్రెస్ నేత జైరాం రమేశ్:

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ప్రధాని మోడీ విధానాలు, సమర్థత కన్నా.. కేజ్రీవాల్ మోసపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. కేజ్రీవాల్ హయంలో జరిగిన వివిధ కుంభకోణాలను పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఎత్తిచూపిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అతిశీ:

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును అంగీకరిస్తున్నామని సీఎం అతిశీ అన్నారు. ఇది ఆప్‌కు ఎదురు దెబ్బే అయినప్పటికీ.. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

ఢిల్లీ ప్రజలు సుపరిపాలన కోరుకున్నారు: యూపీ సీఎం

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అవినీతి, కుంభకోణాల పార్టీలను ఢిల్లీ ప్రజలు ఓడించారని అన్నారు. అలాగే డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకున్నారని చెప్పారు.

ఉత్తరాఖండ్ సీఎం:

ఆప్ ప్రభుత్వం పదేళ్లపాటు విధ్వంసం సృష్టించిందని ఉత్తరఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామీ ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్‌ను ఎన్నుకున్నారని.. మోడీ చెప్పింది చేస్తారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories