Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 24 మందికి గాయాలు

Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 24 మందికి గాయాలు
x

Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 24 మందికి గాయాలు

Highlights

దేశ రాజధానిని కుదిపేసిన ఘోర ప్రమాదం! సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌-1 సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది.

దిల్లీ: దేశ రాజధానిని కుదిపేసిన ఘోర ప్రమాదం! సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌-1 సమీపంలోని పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అగ్నిమాపక శాఖ సమాచారం ప్రకారం, సాయంత్రం 6.55 గంటలకు పేలుడు జరిగినట్లు తెలిపింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. పేలుడు తీవ్రతతో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ప్రస్తుతం దిల్లీ పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్‌ టీమ్‌, ఎన్‌ఐఏ అధికారులు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరు కార్లు, రెండు ఇ-రిక్షాలు, ఒక ఆటో రిక్షా పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. పేలుడు పదార్థాలు దూరం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సోమవారం పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు మూసివుండటంతో మరణాలు తక్కువగా జరిగాయని స్థానికులు తెలిపారు.

ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, “నేను గురుద్వారా దగ్గర ఉన్నప్పుడు భారీ శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థంకాలేదు. శబ్దం చాలా పెద్దగా వచ్చింది. ఆ కార్‌ దగ్గర ఉన్న వాహనాలన్నీ కాలిపోయాయి,” అని చెప్పాడు.

హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు

పేలుడు నేపథ్యంలో దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఉదయం హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు సామగ్రి పట్టుబడటం, సాయంత్రం దిల్లీలో పేలుడు జరగడం వల్ల భద్రతను మరింత బలోపేతం చేశారు. దిల్లీ–హరియాణా–ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు నిఘా పెంచారు.

రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్పెషల్‌ సెల్‌, క్రైం బ్రాంచ్‌ బృందాలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా సింఘు, టిక్రీ, బదర్‌పుర్‌ సరిహద్దుల వద్ద అదనపు పికెట్లు ఏర్పాటు చేసి గస్తీని ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories