Delhi High Alert: ఢిల్లీకి ఉగ్రముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు!

Delhi High Alert: ఢిల్లీకి ఉగ్రముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు!
x

Delhi High Alert: ఢిల్లీకి ఉగ్రముప్పు.. హై అలర్ట్ ప్రకటించిన నిఘా వర్గాలు!

Highlights

Delhi High Alert: దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాద ముప్పు వణికిస్తోంది. తాజాగా అందిన ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.

Delhi High Alert: దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాద ముప్పు వణికిస్తోంది. తాజాగా అందిన ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం, ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసినట్లు సమాచారం.

చారిత్రక ఎర్రకోట (Red Fort), చాందీనీ చౌక్ ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిషేధిత ఉగ్రవాద సంస్థ 'లష్కరే తోయిబా' ఈ విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి.

హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లోనూ, రద్దీగా ఉండే మార్కెట్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ సెల్ అధికారులు రంగంలోకి దిగారు. అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిశితంగా నిఘా ఉంచారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories