DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

DK Shivakumar
x

DK Shivakumar: మరో మూడు నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

Highlights

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారనే ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి.

DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారనే ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. తాజాగా, ఆయన సన్నిహితుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌.ఎ. ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహగానాలకు మళ్లీ ఊపొచ్చించాయి.

ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్బాల్ హుస్సేన్, "ఇంకా రెండు నుంచి మూడు నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించే అవకాశం ఉంది" అని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంలో శివకుమార్ చేసిన కృషిని గుర్తు చేస్తూ, పార్టీ అధిష్ఠానం కూడా ప్రస్తుతం ఆయన గురించే చర్చిస్తున్నదని అన్నారు.

విప్లవాత్మక పరిణామాల సంకేతాలు?

ఇటీవల రాష్ట్ర మంత్రి కె.ఎన్. రాజన్న మాట్లాడుతూ, "సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటాయి" అన్నారు. దీంతో, అధికార కాంగ్రెస్ వర్గాల్లో నాయకత్వ మార్పు త్వరలో జరిగే అవకాశమనే చర్చ మరింత వేడెక్కింది.

సిద్ధరామయ్య స్పందన – అధిష్ఠానం నిర్ణయమే కీలకం

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, "నాయకత్వ మార్పు అధిష్ఠానం పరిధిలో ఉంది. దీనిపై నేను బహిరంగంగా మాట్లాడలేను" అని స్పష్టం చేశారు.

రెండున్నరేళ్ల ఒప్పందం.. ఇప్పుడు అమలు వేళా?

2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య – డీకే శివకుమార్‌ల మధ్య రెండు-రెండున్నరేళ్ల పంచాయితీ పాలన ఒప్పందం జరిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచే డీకే శివకుమార్ స్పష్టంగా, "ఒకరోజు నేను ముఖ్యమంత్రి అవుతాను" అనే మాటలు చెబుతూ వచ్చారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, "మరిన్ని స్థానాల్లో గెలిస్తే, సీఎం పదవికి నన్ను బలోపేతం చేస్తుంది" అని వ్యాఖ్యానించారు.

పార్టీలో మళ్లీ చర్చలు మొదలు

ఇప్పుడు ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలతో, కర్ణాటక కాంగ్రెస్ లోపల మళ్లీ నాయకత్వ మార్పుపై చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునేంతవరకూ అధికారపక్షంలో ఈ అంశం వేడెక్కిన చర్చగా కొనసాగే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories