Shimla: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌పై డాక్టర్‌ దాడి

Shimla: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌పై డాక్టర్‌ దాడి
x

Shimla: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌పై డాక్టర్‌ దాడి

Highlights

Shimla: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌పై డాక్టర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన.. హిమాచల్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Shimla: వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌పై డాక్టర్ విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన.. హిమాచల్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అర్జున్ పవార్ అనే టీచర్‌.. బ్రీతింగ్ సమస్యతో ఎండోస్కోపీ కోసం సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి వెళ్లాడు. టెస్టుల తర్వాత అతన్ని ఒక మంచంపై విశ్రాంతి తీసుకోమని ఓ వైద్యుడు సూచించాడు. కానీ, మరో డాక్టర్ అందుకు నిరాకరించాడు.

ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రమైంది. తనను అవమానించేలా డాక్టర్ కామెంట్స్ చేయడంతో గౌరవంగా మాట్లాడాలని పేషెంట్‌ అర్జున్ పవార్‌ కోరగా.. అతడిపై డాక్టర్‌ దాడికి దిగాడని బాధితుడు ఆరోపించాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పేషెంట్‌ బంధువులు పెద్ద సంఖ్యలో IGMC ఆస్ప్రత్రికి తరలివచ్చారు. డాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి ధనిరామ్ షాడిల్‌ కూడా స్పందించి.. విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories