SIR: రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన

SIR: రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన
x
Highlights

SIR: ఓటర్ల జాబితా సవరణలో ఈసీ దూకుడు పెంచింది. ఇప్పటికే బిహార్ ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ చేసిన ఎన్నికల కమిషన్‌ రెండో దశను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది.

SIR: ఓటర్ల జాబితా సవరణలో ఈసీ దూకుడు పెంచింది. ఇప్పటికే బిహార్ ఎన్నికలకు ఓటర్ల జాబితా సవరణ చేసిన ఎన్నికల కమిషన్‌ రెండో దశను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెకండ్ ఫేజ్‌ S.I.R. నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ వెల్లడించారు. అండమాన్, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్.. మధ్యప్రదేశ్, పుదుచ్ఛేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌.. పశ్చమి బెంగాల్‌లో రెండో దశ SIR జరగనుంది. దాదాపు 51 కోట్ల ఓటర్లున్న ఈ ప్రాంతాల్లో సవరణను చేపట్టనుంది ఈసీ.

రేపటి నుంచి రెండో దశ ఓటర్ల సవరణ ప్రారంభం కానుండగా... నవంబర్ 3 వరకు ప్రింటింగ్, ట్రైనింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 9వరకు ఇంటింటి ఓటర్ల జాబితా సేకరిస్తారు. డిసెంబర్ 8న ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ను ప్రకటిస్తారు. అనంతరం అందులో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా,... తమ పేర్లు నమోదు కాకపోయినా డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు ఓటర్లకు అందించిన నోటీసులపై విచారణ జరగనుంది. మొత్తంగా ప్రక్రియ పూర్తి చేసి.. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది ఈసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories