EC: ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించలేరు.. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం

EC: ఆన్‌లైన్‌లో ఓట్లు తొలగించలేరు.. రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారం
x
Highlights

EC: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది.

EC: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఖండించింది. సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు నిరాధారమని, అసత్యమని ఈసీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ద్వారా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఒక ఓటరుకు సమాచారం ఇవ్వకుండా వారి ఓటును ఎవరూ తొలగించలేరని ఈసీ వివరించింది. 2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఈసీ స్వయంగా ఫిర్యాదు చేసిందని తెలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు బి.ఆర్. పాటిల్ గెలిచారని కూడా గుర్తు చేసింది. అంతకు ముందు 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారని ఈసీ తన ప్రకటనలో పేర్కొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories