Asaduddin Owaisi: ముస్లింలను, కశ్మీరీలను లక్ష్యంగా చేయొద్దు.. నేవి అధికారి భార్య మాటలను ప్రస్తావించిన ఒవైసీ!

Asaduddin Owaisi
x

Asaduddin Owaisi: ముస్లింలను, కశ్మీరీలను లక్ష్యంగా చేయొద్దు.. నేవి అధికారి భార్య మాటలను ప్రస్తావించిన ఒవైసీ!

Highlights

Asaduddin Owaisi: మే 1న జన్మదినం జరుపుకోవాల్సిన వ్యక్తి, తన 27వ పుట్టినరోజుకు ముందే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నావికాధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాంశి చేసిన ఓ భావోద్వేగ వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆమె మాటలను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సందేశమిచ్చారు.

హిమాంశి చేసిన వ్యాఖ్యలో ముఖ్యంగా "ముస్లింలను, కాశ్మీరీలను లక్ష్యంగా చేయొద్దు, శాంతి కావాలి, న్యాయం కావాలి" అన్న తత్వం దాగుంది. ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ ఆమె హింసకు ప్రత్యుత్తరం హింస కాదని స్పష్టంగా చెప్పడం ఉదాత్తమైన ఉదాహరణగా నిలుస్తోంది.

ఈ మేరకు ఓవైసీ బీహార్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ఈ బాధాకర సమయంలో కూడా హిమాంశి విద్వేషానికి వ్యతిరేకంగా నిలబడిందని అన్నారు. దేశాన్ని విభజించే ప్రయత్నం చేసే వారికి ఇదే సమాధానమని చెప్పారు. అలాంటి విద్వేషక చర్యలు ఉగ్రవాదులకే బలం కలిగిస్తాయని స్పష్టం చేశారు.

వినయ్ నర్వాల్, తన పెళ్లి తర్వాత హనీమూన్‌లో పహల్గాం వెళ్లారు. కానీ అతడిని ఉగ్రవాదులు బైసారన్ ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో హత్య చేశారు. అతడు నేవీలో 2022లో చేరి, గత కొద్దికాలంగా కోచీలో విధులు నిర్వర్తిస్తున్నారు. మే 1న జన్మదినం జరుపుకోవాల్సిన వ్యక్తి, తన 27వ పుట్టినరోజుకు ముందే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన తర్వాత దేశమంతా ఒక్కటిగా ఉండాలని, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు ఇస్తున్నారు. హిమాంశి చెప్పిన మానవతా సందేశం ఈ సమయంలో దేశానికి మార్గదర్శిగా నిలవాలన్నది పలువురు నాయకుల ఆకాంక్ష.

Show Full Article
Print Article
Next Story
More Stories