ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం: సీఎం రేవంత్

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం: సీఎం రేవంత్
x
Highlights

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే ఈ పోరాటం చాలా కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.


న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే ఈ పోరాటం చాలా కీలకమైనదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘ఓట్‌ చోర్‌-గద్దీ ఛోడ్‌’ పేరున నిర్వహించిన మహాధర్నాలో ఆయన చాలా ఆవేశంగా ప్రసంగించారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపు ఇచ్చారు. రాజ్యాంగం ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయని, బలహీన వర్గాలవారికి న్యాయం జరుతుందని చెప్పారు.

గత ఎన్నికలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్లాన్ చేసిందన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. అలా చేసినందుకే ఈరోజు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు.

బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ)ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దళితులు, ఆదివాసులు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ, మహాత్మా గాంధీ, అంబేడ్కర్ తదితరుల పోరాటంతో వారికి ఓటు హక్కు వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కలిగిన బీజేపీ మళ్లీ ఆ ఓట్లను లాగేసుకోవాలని చూస్తోందన్నారు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని బీజేపీ చూస్తోందన్నారు.


రేవంత్ రెడ్డి ఉద్వేగభరిత ప్రసంగానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర జాతీయ నేతలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. ఈ మహా ధర్నాకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories