ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టం తెస్తుంది, శ్రేయస్సు రెట్టింపు, న్యూమరాలజీ చెబుతున్న కీలక వివరాలు

ఈ తేదీల్లో పుట్టిన వారికి బంగారం అదృష్టం తెస్తుంది, శ్రేయస్సు రెట్టింపు, న్యూమరాలజీ చెబుతున్న కీలక వివరాలు
x
Highlights

న్యూమరాలజీ ప్రకారం 1, 3, 5 రాడిక్స్ నంబర్‌ కలిగిన వారు, అంటే కొంత నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వారికి బంగారం ధరిస్తే అదృష్టం, శ్రేయస్సు, ఆర్థిక లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏ తేదీలు బంగారం అదృష్టాన్ని తెస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

శతాబ్దాలుగా న్యూమరాలజీ మనుషుల వ్యక్తిత్వాన్ని, అదృష్టాన్ని, జీవన విధానాన్ని అంచనా వేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వానికి ప్రతిబింబమని నిపుణులు చెబుతారు. పుట్టిన తేదీ ఆధారంగా అనేక శుభ–అశుభ ప్రభావాలతో పాటు, కొన్ని ప్రత్యేక వస్తువులు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని కూడా నమ్మకం.

అందులో ముఖ్యంగా బంగారం (Gold). న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి బంగారం ధరిస్తే ఆధ్యాత్మిక శక్తులు పెరిగి, శ్రేయస్సు, అదృష్టం, సంపద వంటి అంశాలు రెట్టింపు అవుతాయి. గురు గ్రహం, సూర్యుడు, బుధుడు ప్రభావంతో బంగారం వీరి జీవితంలో విశేష ఫలితాలు ఇస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.

బంగారంతో అదృష్టం కలిసివచ్చే తేదీలు ఇవే

1️.రాడిక్స్ నెంబర్ 1 — (1, 10, 19, 28 తేదీలు)

ఈ తేదీల్లో పుట్టిన వారు:

  1. ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఎక్కువ
  2. నాయకత్వ లక్షణాలు బలంగా ఉండేవారు
  3. నిరంతరం విజయాన్ని లక్ష్యంగా పెట్టుకునేవారు
  4. కానీ మొండితనం కూడా కొంత ఎక్కువే
  5. వీరికి అధిపతి గ్రహం సూర్యుడు, అందుకే బంగారం ఈ రాశి వారికి అత్యంత అనుకూలం.

బంగారం ధరిస్తే:

1. అదృష్టం పెరుగుతుంది

2.పనులు చక్కగా పూర్తవుతాయి

3.మానసిక శాంతి, శ్రేయస్సు లభిస్తాయి

2.రాడిక్స్ నెంబర్ 5 — (5, 14, 23 తేదీలు)

  1. ఈ తేదీల్లో పుట్టిన వారికి అధిపతి బుధుడు, అంటే:
  2. తెలివితేటలు, వేగవంతమైన నిర్ణయాలు
  3. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  4. వ్యాపారంలో వరుస విజయాలు
  5. స్వతంత్రంగా ఉండడం ఇష్టం

వీరికి బంగారం ధరిస్తే:

1.ఆర్థిక లాభాలు పెరుగుతాయి

2.అదృష్టం స్థిరంగా ఉంటుంది

3.ఉత్సాహం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది

3️.రాడిక్స్ నెంబర్ 3 — (3, 12, 21, 30 తేదీలు)

ఈ తేదీల్లో పుట్టినవారు గురు గ్రహం అనుగ్రహం పొందినవారు.

వీరి ప్రత్యేకతలు:

  1. జ్ఞానం, నాయకత్వం
  2. ఇతరులకు సహాయం చేయడం ఇష్టం
  3. కళా, సృజనాత్మకతలో నైపుణ్యం
  4. డబ్బు విషయంలో పెద్దగా కష్టాలు రాకపోవడం

బంగారం ధరిస్తే:

1.లక్ష్మీకటాక్షం పెరుగుతుంది

2.ఆర్థిక శ్రేయస్సు మెరుగవుతుంది

3.మానసిక శాంతి, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది

Show Full Article
Print Article
Next Story
More Stories