Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌ బృందంపై గ్రామస్తుల దాడి – దొంగలని పొరబాటు!

Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌ బృందంపై గ్రామస్తుల దాడి – దొంగలని పొరబాటు!
x

Google Maps : గూగుల్‌ మ్యాప్స్‌ బృందంపై గ్రామస్తుల దాడి – దొంగలని పొరబాటు!

Highlights

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో గూగుల్‌ మ్యాప్స్‌ సర్వే బృందానికి చేదు అనుభవం ఎదురైంది. టెక్‌ మహీంద్రాకు చెందిన ఒక బృందం వాహనంపై కెమెరాలు అమర్చి గ్రామంలోని వీధుల్లో సర్వే నిర్వహిస్తుండగా, వారిని దొంగలుగా భావించిన గ్రామస్థులు అడ్డగించారు.

స్థానికులు కెమెరాలు అమర్చిన వాహనాన్ని చూసి “దొంగతనాల కోసం సమాచారం సేకరిస్తున్నారు” అని అనుమానించి వెంటనే ఆ బృందాన్ని చుట్టుముట్టారు. వాహనాన్ని ఆపి ప్రశ్నించిన గ్రామస్తులు, పోలీసులు చేరుకునేలోపే ఉద్రిక్తత సృష్టించి దాడి చేశారు. అనంతరం పోలీసులు సర్వే బృంద సభ్యులను, కొందరు గ్రామస్థులను స్టేషన్‌కు తరలించారు.

బృంద సభ్యులు మాట్లాడుతూ – “మేము దొంగలమే కాదు, గూగుల్‌ మ్యాప్స్‌ సర్వే చేయడానికి డీజీపీ అనుమతితో వచ్చాం. కానీ గ్రామస్తులు మా మాటలు వినకుండా దాడి చేశారు” అని ఫిర్యాదు చేశారు.

పోలీసులు వివరించగా – ఇటీవల ఆ గ్రామంలో పలు దొంగతనాలు జరగడం వల్ల గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారని, అదే కారణంగా కెమెరాలతో తిరుగుతున్న బృందాన్ని దొంగలుగా భావించి ఉండొచ్చని తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇరువురికీ సర్దిచెప్పి పంపేసినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories