GST Reforms: 140 కోట్ల ప్రజల కోసం పెద్ద నిర్ణయం – నిర్మలా సీతారామన్

GST Reforms: 140 కోట్ల ప్రజల కోసం పెద్ద నిర్ణయం – నిర్మలా సీతారామన్
x
Highlights

140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయి ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయి నాలుగు స్లాబ్‌ల నుంచి రెండు స్లాబ్‌లకు తగ్గించాం: నిర్మలా సీతారామన్

40 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ వల్ల ప్రయోజనాలు చేకూరాయని ఆమె తెలిపారు.

నాలుగు స్లాబ్‌లను రెండు స్లాబ్‌లకు తగ్గించామని, 12 శాతం స్లాబ్‌లో ఉండే వస్తువులలో దాదాపు 99% ను 5% పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. 28% స్లాబ్‌లో ఉన్న వస్తువులలో 90% వరకు 18% స్లాబ్‌లోకి మారాయని వివరించారు. ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ అమలు చేశామని, పాలు, పెరుగు వంటి అవసరమైన వస్తువులను 5% నుంచి నేరుగా సున్నా శాతం స్లాబ్‌లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

2017కి ముందు 17 రకాల పన్నులు, 8 సెస్సులు ఉండేవని గుర్తుచేశారు. వాటన్నింటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే పన్ను, నాలుగు స్లాబ్‌లతో జీఎస్టీ అమలు చేయడం ఒక పెద్ద సంస్కరణ అని అన్నారు. అప్పట్లో ప్రతి రాష్ట్రంలో సబ్బు వంటి వస్తువుల ధర వేరుగా ఉండేదని, ఇప్పుడు ఒకే ధరలో అందుబాటులో ఉందని వివరించారు.

జీఎస్టీ అమలు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, రాష్ట్రాల సహకారంతో ఈ 8 ఏళ్లలో అది 1.51 కోట్లకు పెరిగిందని తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories