MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Hearing On MLC Kavithas Petition In Supreme Court
x

MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

Highlights

MLC Kavitha: ఈనెల 15వ తేదీన పిటిషన్‌ వేయగా.. 24న విచారణ జరుపుతామని తెలిపింది కోర్టు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. చట్టం ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటిదగ్గరే విచారణ జరపాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 15వ తేదీన పిటిషన్‌ వేయగా.. 24న విచారణ జరుపుతామని తెలిపింది కోర్టు. అయితే 24 విచారణ జరపకపోవడంతో ఇవాళ విచారణ చేపట్టనుంది ధర్మాసనం. మరోవైపు కవిత వేసిన పిటిషన్‌పై కేవియెట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది ఈడీ. తమ వాదనలు వినకుండా, ఏకపక్షంగా కవిత విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదని సుప్రీంను ఆశ్రయించింది. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే బెంచ్‌ ఆదేశాలు జారీ చేయనుంది సుప్రీంకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories