Prajwal Revanna: పట్టుకుంటే పాత చీర.. ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఇదే సాక్ష్యం

How a Forgotten Saree Exposed Prajwal Revanna in Rape Case
x

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణను నేరస్థుడిగా నిరూపించిన ఫాంహౌస్‌లోని చీర!

Highlights

Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లైంగికదాడి కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.

Prajwal Revanna: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లైంగికదాడి కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. 47 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి వీడియో తీసిన కేసులో, ఒక పాత చీరే అతని నేరాన్ని రుజువు చేసే కీలక ఆధారంగా మారింది.

ఫాంహౌస్ అటకపై దాచిన చీర.. ప్రధాన సాక్ష్యం

అత్యాచారానికి గురైన మహిళకు చెందిన చీరను ప్రజ్వల్ దాడి అనంతరం బలవంతంగా తీసుకున్నాడు. ఎవరూ గుర్తించలేరన్న ఉద్దేశంతో ఆ చీరను తన ఫాంహౌస్‌లోని అటకపై దాచి ఉంచాడు. అయితే, బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు ఫాంహౌస్‌పై తనిఖీ చేసి ఆ చీరను స్వాధీనం చేసుకున్నారు.

ఆ చీరను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపగా.. దానిపై వీర్యం ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. డీఎన్‌ఏ పరీక్షలో ఆ ఆనవాళ్లు ప్రజ్వల్ డీఎన్‌ఏతో సరిపోవడంతో కేసులో అతని పాత్ర స్పష్టమైంది.

సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదుతో పాటు రూ. 11 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం బాధితురాలికి పరిహారంగా ఇవ్వాలని కూడా ఆదేశించింది.

చీరపై లభించిన డీఎన్‌ఏ ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలంతో కలిపి ప్రాసిక్యూషన్ వాదన బలంగా నిలిచింది. చివరకు ప్రజ్వల్ దోషిగా తేలి శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories