సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి పారిపోయిన దుండగుడిని ముంబై పోలీసులు ఎలా పట్టుకున్నారు?

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి పారిపోయిన దుండగుడిని ముంబై పోలీసులు ఎలా పట్టుకున్నారు?
x
Highlights

Saif Ali Khan case latest news: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశీయుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి అసలు పేరు షరీఫుల్...

Saif Ali Khan case latest news: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశీయుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్. ఇండియాకు వచ్చి విజయ్ దాస్‌గా పేరు మార్చుకుని తిరుగుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి, సైఫ్‌తో పాటు ఆయన చిన్న కొడుకు జహంగీర్‌కు కేర్ టేకర్‌గా ఉన్న ఎలియామ ఫిలిప్‌పై దాడి చేశారు. ఈ దాడి అనంతరం అక్కడి నుండి పారిపోయారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన దుండగుడిని అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మొత్తం 30 పోలీసు బృందాలు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇంటితో పాటు ఆయన నివాసం ఉంటున్న సద్గురు శరణ్ బిల్డింగ్‌లో ఉన్న అన్ని సీసీ కెమెరాలనీ అనువణువు గాలించారు. ఈ దాడి అనంతరం ఒక అనుమానిత వ్యక్తి ఆ భవనంలోంచి వెళ్తుండటం కనిపించింది. ఆ వ్యక్తిని గుర్తించడం కోసం సిటీలో మిగతా ప్రాంతాల్లో ఉన్న అన్ని సిసీటీవీ కెమెరాల ఫీడ్ చెక్ చేశారు.

ఈ క్రమంలోనే ముంబైలోని అంధేరీలో ఉన్న డీఎన్ నగర్ వద్ద ఇదే అనుమానిత వ్యక్తి ఓ వ్యక్తి బైక్ దిగుతున్నట్లుగా గుర్తించారు. ఆ సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్న బైక్ నెంబర్ ఆధారంగా అతడని ట్రేస్ చేశారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా వొర్లిలోని కొలివాడలో ఒక అద్దె ఇంటిని గుర్తించారు. ఆ ఇంట్లో అనుమానిత వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఉంటున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. ఆ ఇంటిని సాయుధులైన పోలీసులు చుట్టుముట్టారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అతడు లేడు. ఇంట్లో ఉన్న మిగతా వారిని ప్రశ్నించగా ఆ వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, ఇతర వివరాలు తెలిపారు.

ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తే అతడు థానెలో ఉన్నట్లు తెలిసింది. వెంటనే కొన్ని సాయుధ పోలీసు బలగాలు థానెకు వెళ్లాయి. ఫోన్ లోకేషన్ ప్రకారంగా వెళ్లి చూస్తే ఆ వ్యక్తి ఒక నిర్మానుష్యంగా ఉన్న రోడ్డును ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లో దాక్కుని ఉన్నాడు. పోలీసులు ఆ వ్యక్తిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories