Delhi Elections: ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం జాబితాలో ఉన్నది వీళ్లే

Delhi Elections: ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం జాబితాలో ఉన్నది వీళ్లే
x
Highlights

Delhi Elections: ఢిల్లీ ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో...

Delhi Elections: ఢిల్లీ ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలిపోనున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీ పీఠం బీజేపీదే అంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. దీంతో బీజేపీ ఢిల్లీ నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒకవేళ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటే ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై ప్రస్తుత రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లోనే బీజేపీ మెజారిటీ మార్కును దాటింది. 30ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ సారైనా జెండా ఎగరవేయాలని బీజేపీ పోటీ పడుతోంది. అలాగే మధ్య లో కాంగ్రెస్ పార్టీ కూడా పీఠం తమదే అంటూ ధీమాగా ఉంది. అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీదే విజయం అంటూ ప్రకటించాయి. దీంతో బీజేపీ నాయకుల్లో ఉత్సాహం వచ్చింది. అయితే ఢిల్లీ పీఠం బీజేపీ సొంతమైతే..ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎంపీ మనోజ్ తివారీ, ప్రవేశ్ వర్మ, రమేశ్ బిధూడీ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆప్ అధినేత కేజ్రీవాల్..ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి రమేశ్ బిధూడీ అని తన మనసులో మాట చెప్పిన సంగతి తెలిసిందే.

సాధారణంగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించడం పరిపాటిగా వస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సందర్బాల్లో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు రాజస్థాన్ , మధ్యప్రదేశ్ ఉదంతాలను గుర్తు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధర రాజే, మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ లను ముఖ్యమంత్రిలుగా నియమించలేదని, దీన్ని బట్టి ఢిల్లీ కూడా ఇలాగే జరుగుతుందని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్ దేవా, ప్రవేశ్ వర్మ..ఈ ముగ్గురిలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా చేసే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఢిల్లీలో 1993లో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్బంగా ముఖ్యమంత్రిలను మార్చిన క్రమంలో 1998లో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా ఈమే. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా అభ్యర్థి మళ్లీ ముఖ్యమంత్రి అవకాశం ఉందని సమాచారం. సీఎం రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లు బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి ప్రజల్లో కూడా మంచి క్రేజ్ ఉండటంతో వీరిలో ఎవరో ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. మహిళను ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఢిల్లీని మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని కూడా బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీలో ఏ పార్టీ పాగా వేస్తుంది..ఎవరు సీఎం అవుతారు అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories