Illegal occupation: కశ్మీర్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్‌.. ఇచ్చిపడేసిన ఇండియా!

Illegal occupation
x

Illegal occupation: కశ్మీర్‌పై మరోసారి విషం కక్కిన పాకిస్థాన్‌.. ఇచ్చిపడేసిన ఇండియా!

Highlights

Illegal occupation: కశ్మీర్‌ను 'జుగ్యులర్ వీన్' అంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్‌ భారతదేశానికి విడదీయలేని భాగమని, పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను తక్షణమే ముగించాలని న్యూఢిల్లీ హెచ్చరించింది.

Illegal occupation: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు భారత్‌ను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఆయన చేసిన "మర్చిపోవం, వదలము" వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. కశ్మీర్‌ను పాకిస్తాన్ జుగ్యూలర్ వీన్ అని సంబోధించడం సరికాదని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ ఇండియాలోని యూనియన్ టెరిటరీ అని, పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలన్నదే భారత్ అభిప్రాయమని వెల్లడించింది.

అసిం మునీర్ విదేశాల్లోని పాకిస్తానీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, జమ్మూ కశ్మీర్‌ను తమ భాగంగా భావిస్తూ, ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించడానికి ప్రయత్నించారు. మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు వేర్వేరని పేర్కొంటూ, ఈ భిన్నతలే పాకిస్తాన్ ఏర్పాటుకు మూలం అన్నాడు.

ఇక మతాన్ని ఆధారంగా చేసుకొని చేసిన ఆ వ్యాఖ్యలపై న్యూఢిల్లీ అసహనం వ్యక్తం చేసింది. అటు ఈ వ్యాఖ్యల పట్ల భారత్‌ తిరుగుబాటు స్ఫూర్తిని ప్రదర్శించింది. మునీర్ చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయం చేయడమేనని, భౌగోళిక వాస్తవాలను మార్చలేవని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేంత స్థాయిలో భారత్‌ అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని తీసుకెళ్లే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories