CDS Anil Chauhan: సుదీర్ఘ యుద్ధాలకూ భారత్ సిద్ధంగా ఉండాలి.. సీడీఎస్ అనిల్ చౌహన్

CDS Anil Chauhan
x

CDS Anil Chauhan: సుదీర్ఘ యుద్ధాలకూ భారత్ సిద్ధంగా ఉండాలి.. సీడీఎస్ అనిల్ చౌహన్

Highlights

CDS Anil Chauhan: అణు సామర్థ్యం కలిగిన చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

CDS Anil Chauhan: అణు సామర్థ్యం కలిగిన చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని పేర్కొన్న ఆయన, స్వల్పకాలికంగానూ, సుదీర్ఘకాలికంగానూ వచ్చే యుద్ధాలకు దేశం సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఐఐటీ బాంబేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీడీఎస్, “మన ప్రత్యర్థులు అణు సామర్థ్యం కలిగి ఉన్నారు. వారి నుంచి వచ్చే ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. గతంలో నిర్వహించిన ఆపరేషన్ల మాదిరిగానే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘకాలిక ఘర్షణలకు సిద్ధపడాలి. ఇప్పటికే కొనసాగుతున్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో భూతల ఘర్షణల్లో పోరాడే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అయితే వీటిని నివారించేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరగాలి” అని అన్నారు.

భవిష్యత్తు యుద్ధ స్వరూపం వేగంగా మారుతోందని ఆయన తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్‌సోనిక్ ఆయుధాలు, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు యుద్ధ విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల సంప్రదాయ సైనిక శక్తితో పాటు ఆధునిక టెక్నాలజీలోనూ భారత్ ముందుండాల్సిన అవసరం ఉందని సీడీఎస్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories