India Reacts to Nicolas Maduro’s Arrest: 'వెనిజులాతో మాకు దశాబ్దాల మైత్రి.. శాంతి నెలకొనాలి' - ఎస్. జైశంకర్

India Reacts to Nicolas Maduro’s Arrest: వెనిజులాతో మాకు దశాబ్దాల మైత్రి.. శాంతి నెలకొనాలి - ఎస్. జైశంకర్
x
Highlights

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై భారత్ స్పందించింది. వెనిజులాతో తమకు దశాబ్దాల మైత్రి ఉందని, అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆకాంక్షించారు.

వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నాటకీయ పరిణామంపై భారత్ తొలిసారిగా నోరు విప్పింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్సెంబర్గ్ పర్యటనలో ఉన్న ఆయన, ఈ సంక్షోభంపై దౌత్యపరమైన కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్ వైఖరి ఇదే:

శాంతియుత పరిష్కారం: వెనిజులాలో ప్రస్తుత ఉద్రిక్తతలు తగ్గి, శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోంది. సమస్య ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని జైశంకర్ సూచించారు.

దశాబ్దాల బంధం: వెనిజులాతో భారత్‌కు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అక్కడ ఏం జరిగినా ఆ దేశ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

భారతీయుల భద్రత: కారకాస్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులతో నిరంతరం టచ్‌లో ఉందని, వారి భద్రతపై నిఘా ఉంచామని తెలిపారు.

అసలేం జరిగింది?

నార్కో-టెర్రరిజం (డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాదం) ఆరోపణలతో అమెరికా దళాలు మదురోను బంధించి న్యూయార్క్‌కు తరలించాయి. అయితే న్యూయార్క్ కోర్టులో హాజరైన మదురో, అమెరికా తనను అపహరించిందని, తాను ఒక 'యుద్ధ ఖైదీని' అని గర్జించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ప్రయాణ హెచ్చరిక (Travel Advisory):

వెనిజులాలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప భారతీయులు ఎవరూ వెనిజులాకు ప్రయాణించవద్దని ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories