India China 4 Point Formula:చైనా, భారత్ సరిహధ్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 పాయింట్ ఫార్ములా

India China 4 Point Formula
x

India China 4 Point Formula:చైనా, భారత్ సరిహధ్దు ఉద్రిక్తతల పరిష్కారానికి 4 పాయింట్ ఫార్ములా

Highlights

India China 4 Point Formula: భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇరుదేశాలకు సంబంధించి సరిహధ్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్ నాథ్ ప్రతిపాదించినట్లు సమాచారం.

India China 4 Point Formula: భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇరుదేశాలకు సంబంధించి సరిహధ్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్ నాథ్ ప్రతిపాదించినట్లు సమాచారం.

భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొన్ని రోజులుగా చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశ రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సరిహద్దు భద్రత అంశాలపై వీరిరువురూ చర్చలు జరిపారు. ఇందులో భాగాంగా రాజ్ నాథ్ సింగ్ నాలుగు పాయింట్ ఫార్లులాను చైనా ముందు ఉంచారు. ఈ నాలుగు పాయింట్లు ఏంటంటే.. 2024లో కుదుర్చుకున్న బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం, సరిహద్దుల గుర్తింపు, నిర్ధారణ లక్ష్యాలను సాంధించే చర్యలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేయడం, విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం వంటి నాలుగు పాయింట్లను రాజనాధ్ తాను ప్రవేశపెట్టిన ప్రణాళికలో సూచినట్లు సమాచారం.

చైనా, భారత్ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో రాజనాథ్ మరికొన్ని కీలక అంశాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం అంశంపై ఆయన మాట్లాడారు. పాక్ పెంచి పోషించే ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకే తాము ఆపరేషన్ సింధూర్‌‌ని చేపట్టినట్లు కూడా ఆయన ఈ సమావేశంలో చెప్పనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాజ్ నాథ్ సింగ్ ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ సమావేశం విజయవంతమైనట్లు, రెండు దేశాల మధ్య కొన్ని కీలకమైన అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లారు. ఈ సదస్సులో పహల్గాం ఉగ్రదాడి గురించి అదేవిధంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన గట్టిగా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తమ దేశ హక్కని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories