Operation Sindoor: పాకిస్తాన్ మిస్సైల్స్ ను కూల్చివేత..వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ

Indian Army shares video of downing Pakistani missiles
x

Operation Sindoor: పాకిస్తాన్ మిస్సైల్స్ ను కూల్చివేత..వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ

Highlights

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ...

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మెరుపు దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో రగిలిపోయిన పాకిస్తాన్..వెంటనే భారత ఆర్మీ సదుపాయాలు, జనావాసాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. వందలాదిగా పాక్ డ్రోన్స్, మిస్సెల్స్ ను భారత్ పై ప్రయోగించింది.

దీంతో ఎస్ 400, ఆకాశ్ వంటి మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడిక్కడ కూల్చిపడేశాయి. దీంతో పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్స్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు ఇప్పుడు పెద్దత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుగోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పై జరిపిన పలు దాడుల వీడియోలను భారత ఆర్మీ విడుదల చేసింది. తాజాగా పాకిస్తాన్ మిస్సైల్స్ ను ఎలా కూల్చారో తెలిపే విధంగా వెస్ట్రన్ కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అగ్ని గోడలా భారత ఆర్మీ శత్రుదేశపు మిస్సైళ్లను కూల్చిందని పేర్కొంది.



Show Full Article
Print Article
Next Story
More Stories