Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం...ఎక్కడంటే?

Indias first private helicopter manufacturing facility in Karnataka
x

Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం...ఎక్కడంటే?

Highlights

Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్నాటకలో ఏర్పాటు చేయనున్నారు. యూరప్ కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్ బస్, టాటా...

Karnataka: దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్నాటకలో ఏర్పాటు చేయనున్నారు. యూరప్ కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్ బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లు సంయుక్తంగా కర్నాటకలోని కోలారు జిల్లాలో హెచ్ 125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. తొలుత 10 యూనిట్లు, ఆ తర్వాత20 ఏళ్లలో 500 హెలికాప్టర్ల తయారీ దిశగా దీన్ని విస్తురించనున్నారు. కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీసాంకేతికతను ఉపయోగిస్తారు. అలా తయారైన వాటిని దేశీయ అవసరాలకు, భారతీయసైన్యానికి, ఇతర దేశాలకూ సరఫరా చేయనున్నారు.

ఫ్రాన్స్ , అమెరికా, బ్రెజిల్ తర్వాత హెచ్ 125హెలికాప్టర్ల తయారీ యూనిట్ స్థాపించే నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. హెలికాప్టర్ల తయారీ నిర్వహణ, మరమ్మతు, ఒప్పంద కార్యక్రమ కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించనున్నారు. దీంతోపాటు ఇతర ఒప్పంద కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసేందుకు కర్నాటక ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమ శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories