భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే? సానుకూల సంకేతాలు, తొలి దశపై పరిశ్రమలలో ఆసక్తి!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే? సానుకూల సంకేతాలు, తొలి దశపై పరిశ్రమలలో ఆసక్తి!
x
Highlights

India US Trade Deal: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై సానుకూల సంకేతాలు. 50% సుంకాల తొలగింపు, 200 ఉత్పత్తులపై పన్ను మినహాయింపు–తొలి దశలో ఏం జరగబోతోంది?

అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందంపై అధికారిక ప్రకటన చాలా దగ్గరలోనే ఉండొచ్చని ఇరుదేశాల నుంచీ సానుకూల సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వానికి కీలక అధికారి, యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ చేసిన ప్రకటనతో పాటు, భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా “త్వరలో శుభవార్త ఉంటుంది” అని వెల్లడించడంతో, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

ఇదే సమయంలో, భారత్‌పై అమెరికా విధించిన 50% సుంకాలకుగల కారణమైన రష్యా ముడిచమురు దిగుమతులు తగ్గుముఖం పట్టడం కూడా ఈ ఒప్పందం వేగంగా కుదిరే అవకాశాలను పెంచుతోంది. రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, డిసెంబర్ 1 నుంచి రష్యేతర ముడిచమురుతో తయారు చేసిన ఉత్పత్తులనే ఎగుమతిచేస్తామని ప్రకటించటం ఇందులో కీలక పరిణామం.

ఇప్పటి వరకు ఏం జరిగింది?

ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై విధించిన సుంకాలు:

  1. 25% ప్రాథమిక పన్ను
  2. 25% అదనపు పన్ను (రష్యా చమురు కారణంగా)
  3. మొత్తం 50% సుంకం భారత ఉత్పత్తులపై

చైనా, యూరప్ చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు భారత్ ఎందుకు కొనకూడదని భారత ప్రభుత్వం నిలదీయడంతో, అమెరికా–భారత్ మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనితో భారత్ రష్యా, చైనా వైపు ఎక్కువగా మొగ్గుచూపాల్సి వచ్చింది.

అయితే, ఈ పరిస్థితి తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు హాని చేస్తుందనే అభిప్రాయం అమెరికాలో బలపడింది. వ్యూహాత్మక సంబంధాలు–వాణిజ్య ప్రయోజనాలు పెంచుకునేందుకు ఇరు దేశాలు అనుకూలంగా ఉండడంతో, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలు వేగంగా సాగుతున్నాయి.

ఇప్పటికే 5 రౌండ్ల చర్చలు పూర్తయ్యాయి. భారత వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గతవారం అమెరికా వెళ్లి చర్చలు నిర్వహించారు.

అమెరికా సుంకాల వల్ల అత్యధిక నష్టపోయిన భారత రంగాలు

  1. రెడీమేడ్ దుస్తులు, టెక్స్‌టైల్స్
  2. వజ్రాలు, రత్నాభరణాలు
  3. చేపలు, రొయ్యలు
  4. తోలు ఉత్పత్తులు
  5. ఇంజినీరింగ్ ఉత్పత్తులు
  6. వాహన విడిభాగాలు
  7. కార్పెట్లు, పాదరక్షలు

200 ఉత్పత్తులపై పన్ను మినహాయింపు — భారత ఎగుమతులకు ఊరట

నవంబర్ 12న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి దాదాపు 200 ఆహార ఉత్పత్తులపై సుంకాలు తొలగించారు. వీటిలో:

  1. కాఫీ
  2. టీ
  3. పండ్లు
  4. మసాలాలు
  5. కోకోవా
  6. అరటిపండ్లు
  7. బత్తాయిలు
  8. టమోటాలు
  9. మాంసం ఉత్పత్తులు

దిగుమతి సుంకాలు పెరగడం వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో, ఆ ఒత్తిడిని తగ్గించేందుకే ఈ సడలింపు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

దీంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే 2.5–3 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులకు ఉపశమనం లభించనుందని వాణిజ్య శాఖ అంచనా.

అమెరికా — భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి

  1. భారత ఎగుమతుల్లో 18% అమెరికా వాటా
  2. భారత దిగుమతుల్లో 6% అమెరికా వాటా
  3. 2030 నాటికి $500 బిలియన్ ట్రేడ్ టార్గెట్

సుంకాల కారణంగా ఈ లక్ష్యం తాత్కాలికంగా దెబ్బతిన్నా, ఒప్పందం కుదిరితే మళ్లీ వాణిజ్యం భారీ స్థాయిలో పెరుగుతుందని పరిశ్రమలు భావిస్తున్నాయి.

ఒప్పందం – తొలి దశలో ఏం ఖరారు కానుంది?

తొలి దశ BTA ముఖ్యాంశాలు

  1. భారత ఉత్పత్తులపై విధించిన 50% సుంకాల తొలగింపు
  2. బదులుగా భారత మార్కెట్లో అమెరికా వస్తువులకు సులభ ప్రవేశం

రెండో దశ ఒప్పందం

  1. దీర్ఘకాలిక, పరస్పర లాభదాయక వాణిజ్య ఒప్పందం
  2. వ్యూహాత్మక–ఆర్థిక సంబంధాల మరింత బలపరిచే రోడ్‌మ్యాప్
Show Full Article
Print Article
Next Story
More Stories