Richest Beggar: బిచ్చగాడు కాదు.. కోటీశ్వరుడు! 3 మేడలు, సొంత కారు, వడ్డీ వ్యాపారం.. మంగీలాల్ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Richest Beggar
x

Richest Beggar: బిచ్చగాడు కాదు.. కోటీశ్వరుడు! 3 మేడలు, సొంత కారు, వడ్డీ వ్యాపారం.. మంగీలాల్ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Highlights

Richest Beggar: మధ్యప్రదేశ్ ఇందౌర్‌లో దిమ్మతిరిగే నిజం వెలుగులోకి వచ్చింది. సరాఫ్ బజార్‌లో భిక్షాటన చేసే మంగీలాల్ అనే బిచ్చగాడికి 3 మేడలు, సొంత కారు, డ్రైవరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా బంగారం వర్తకులకు వడ్డీకి డబ్బులిచ్చే ఈ 'కోటీశ్వరుడు'.

Richest Beggar: పుణ్యం వస్తుందనో, జాలిపడో మనం దానం చేసే బిచ్చగాడు మనకంటే ధనవంతుడైతే ఆ షాక్ ఎలా ఉంటుందో ఇందౌర్ అధికారులకు ఇప్పుడు అర్థమైంది. నగరంలో భిక్షాటన చేస్తున్న మంగీలాల్ అనే వ్యక్తి ఆస్తుల చిట్టా చూసి అధికారులు నోరెళ్లబెట్టారు.

అసలేం జరిగింది?

ఇందౌర్‌ను బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 6,500 మందిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే సరాఫ్ బజారులో చక్రాల బండిపై భిక్షాటన చేస్తున్న దివ్యాంగుడైన మంగీలాల్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.

మంగీలాల్ 'రాయల్' ఆస్తుల లిస్ట్ ఇవే:

మూడు అంతస్తుల మేడలు: ఇందౌర్ నగరంలో మంగీలాల్‌కు ఏకంగా మూడు మేడలు ఉన్నాయి. ఇందులో ఒక ఇంటిని దివ్యాంగుడని రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఉచితంగా పొందడం విశేషం.

లగ్జరీ కారు & డ్రైవర్: నగరం దాటితే మంగీలాల్ రేంజ్ మారిపోతుంది. ఆయనకు సొంతంగా ఒక స్విఫ్ట్ డిజైర్ (Swift Dzire) కారు ఉంది. దానికి ఒక డ్రైవర్‌ను కూడా నియమించుకున్నాడు.

వడ్డీ వ్యాపారం: సరాఫ్ బజారులోని కొందరు బంగారం వర్తకులకు మంగీలాల్ లక్షల రూపాయలను వడ్డీలకు ఇస్తున్నాడు.

ఆటోల అద్దె: ఇవి కాకుండా మూడు ఆటోలు కొనుగోలు చేసి వాటిని అద్దెకు తిప్పుతూ నెలకు భారీగా ఆదాయం సంపాదిస్తున్నాడు.

అధికారుల విచారణ:

భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును మంగీలాల్ ఇలా ఆస్తులుగా మార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. "ఒక బిచ్చగాడు కోటీశ్వరుడిగా మారడం వెనుక ఏదైనా మాఫియా ఉందా లేదా అనేది లోతుగా దర్యాప్తు చేస్తున్నాం" అని అధికారి దినేష్ మిశ్ర తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories