Bengaluru Infosys: బెంగుళూరులో ఇన్ఫోసిస్ మహిళల వాష్‌రూమ్‌లో అశ్లీల వీడియో కలకలం..ఆంధ్రా టెకీ అరెస్ట్

Bengaluru Infosys
x

Bengaluru Infosys: బెంగుళూరులో ఇన్ఫోసిస్ మహిళల వాష్‌రూమ్‌లో అశ్లీల వీడియో కలకలం..ఆంధ్రా టెకీ అరెస్ట్

Highlights

Bengaluru Infosys: బెంగుళూరు ఇన్ఫోసిస్‌ మహిళల వాష్‌రూమ్‌లో అశ్లీల వీడియో కలకలం రేపింది. ఈ కంపెనీ క్యాంపస్‌లో ఒక మహిళ వాష్‌రూమ్‌లో ఉండగా రహస్యంగా వీడియో తీసాడని ఆంధ్రాకు చెందిన నగేష్ స్వప్నిల్ మాలి(28)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Bengaluru Infosys: బెంగుళూరు ఇన్ఫోసిస్‌ మహిళల వాష్‌రూమ్‌లో అశ్లీల వీడియో కలకలం రేపింది. ఈ కంపెనీ క్యాంపస్‌లో ఒక మహిళ వాష్‌రూమ్‌లో ఉండగా రహస్యంగా వీడియో తీసాడని ఆంధ్రాకు చెందిన నగేష్ స్వప్నిల్ మాలి(28)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత నగేష్‌ని ఉద్యోగం నుంచి తొలగించారు.

నగేష్ స్వప్నిల్ మాలి బెంగుళూరు ఇన్ఫోసిస్‌లో సీనియర్ అసోసియేట్‌గా చేస్తున్నారు. సోమవారం డ్యూటీలో ఉన్న సమయంలో తోటి మహిళా ఉద్యోగి వాష్‌ రూమ్‌లో ఉన్నప్పుడు ఆమెను రహస్యంగా వీడియో తీస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌లో వివరించిన దాని ప్రకారం, ఇన్ఫోసిస్‌లో చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడు తలుపుపైన ఎవరిదో నీడ కనిపించడం ఆమె గుర్తించింది. వెంటనే ఎవరో ఏదో చేస్తున్నారని గ్రహించింది. ఆ తర్వాత తన పక్కన ఉన్న వేరే వాష్ రూంలో ఏదో అనుమానాస్పదంగా కదులుతుండటం కూడా గమనించింది. ఆ తర్వాత నగేష్ వీడియో తీస్తున్నట్టుగా ఆమె గుర్తించింది. ఆ తర్వాత భయంతో ఆ మహిళా ఉద్యోగిని అక్కడ నుంచి పక్కకు వచ్చి.. ఎమర్జెన్సీ అలారంని మోగించింది.

అలారం మోగిన వెంటనే అక్కడకు వచ్చిన స్టాఫ్‌కు జరిగినదంతా చెప్పింది. అప్పడు వారంతా నగేష్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ని తీసి చెక్ చేయగా.. అతను రికార్డ్ చేసిన వీడియో కనిపించింది. అప్పుడే ఆ క్షణమే అందరూ అతన్ని చితకబాదారు. అయితే ఆ తర్వాత పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఇక ఆ తర్వాత ఆ వీడియోని హ్యూమన్ రిసోర్సెస్‌ మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని తొలగించింది.

అయితే షాకయ్యే విషయం ఏంటంటే విచారణలో నగేష్ మొబైల్ చూసిన పోలీసులు షాకైపోయారు. అతని ఫోన్‌లో వేర్వేరు మహిళలకు సంబంధించిన వీడియోలు 30కి పైగా ఉన్నాయి. ఇవన్నీ అతనే స్వయంగా రికార్డ్ చేసినట్లు ధర్యాప్తులో తేలింది.

ఇదిలా ఉంటే ఇన్ఫోసిస్ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. నగేష్‌ను విధుల నుంచి తొలగించింది. బాధితులకు మహిళకు అండగా ఉంటామని, పోలీసులకు ఏ విషయంలోనైనా సహకరిస్తామని వెల్లడించింది. ఈ క్యాంపస్‌లో హింస్, అశ్లీలం, వేధింపులకు తావు లేదని, అలాంటి వాటిని సహించేది లేదని, ఇక నుంచి మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మరోపక్క బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగానే విచారణ జరిపిన తర్వాత పోలీసులు నగేష్‌ని అరెస్ట్ చేశారు. మొబైల్‌ని ఇంకా క్షుణంగా పరిశీలిస్తున్నారు. డిలీట్ అయిన వీడియోలను రెస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వివిధ రకాల కోణంలో కేసును మరింత లోతుగా ధర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories