Kashmir Valley: చల్లని గాలులతో స్వాగతం పలికే సరస్సులు.. కానీ ముష్కరుల ర*క్తదాహంతో తడిసిన నేల అది!

Kashmir Valley
x

Kashmir Valley: చల్లని గాలులతో స్వాగతం పలికే సరస్సులు.. కానీ ముష్కరుల ర*క్తదాహంతో తడిసిన నేల అది!

Highlights

Kashmir Valley: చుట్టూ ఆకుపచ్చని పచ్చిక బయళ్లు.. ఎటు చూసినా దట్టమైన పైన్ అడవుల అందాలు..ఇలాంటి మధుర జ్ఞాపకాలను అందించే ప్రాంతమే బైసరాన్!

Kashmir Valley: కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం బైసరాన్ వ్యాలీ. స్విట్జర్లాండ్ లోని ఆల్పైన్ ప్రకృతి అందాలను గుర్తు చేస్తుంది కాబట్టి... దీనికి మినీ స్విడ్జర్లాండ్ అని కూడా పేరుంది. పహల్గామ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లోయ...ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమే. పహల్గామ్ నుంచి బయలుదేరి...లిడ్డర్ నది ఒడ్డున గుర్రపు సవారీ చేస్తూ చుట్టూ ఉన్న అందాలను ఆశ్వాదించడం ఎవరికైనా మనుపురాని అనుభూతి...!కశ్మీర్ వ్యాలీ వ్యూపాయింట్, డబ్యాన్, డీనో వ్యాలీ పాయింట్ వంటి అద్భుతమైన దృశ్యాలు దారి పొడవునా స్వాగతం పలుకుతూ ఉంటాయి. బైసరాన్ కు ఉన్న ప్రత్యేకతే విశాలమైన ఆకుపచ్చ మైదానాలు. దట్టమైన పైన్, ఫిర్, సీడార్ చెట్లతో ఈ మైదానం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది...నిజంగానే స్విట్జర్లాండ్ లోని అల్పైన్ పర్వత శ్రేణుల మధ్య ఉన్నామా..అన్న భావనలోకి వెళ్లిపోతారు పర్యాటకులు..

బైసరాన్ లో అడుగు పెట్టే ప్రతి పర్యాటకుడు కచ్చితంగా రెండు విషయాలను ఎక్స్ పీరియన్స్ చేయాలి. ఒకటి గుర్రపు స్వారీ.. రెండు ట్రెక్కింగ్... బైసరాన్ నుండి తులియన్ సరస్సుకు వెళ్లే మార్గంలో ట్రెక్కింగ్ అందించే ఫీల్ ఓ రేంజ్ లో ఉంటుంది...

శీతాకాలంలో...బైసరాన్ మంచుతో కప్పేసి... అద్భుత భూమిగా మారుతుంది. లోయ మొత్తం తెల్లని కంబళితో కప్పేసినట్టుగా కనిపిస్తుంది... ఆ సమయంలో ట్రెక్కింగ్ కష్టమైనా ..గుర్రపు సవారీని మాత్రం ఎవరూ మిస్ కారు. బైసరాన్ వ్యాలీ కేవలం ఒక పర్యాటక గమ్యస్థానం కాదు...ఇది ప్రకృతి ఒడిలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడి ప్రతి అడుగు కొత్త ఆనందాన్ని, కొత్త దృశ్యాన్ని అందిస్తుంది. శాశ్వతమైన జ్ఞాపకాలను మిగుల్చుతుంది.

ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతంలోనే ఉగ్రవాదులు రక్తం చిందించారు. అమాయకులైన టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు బైసరాన్ పేరు పెడితే.. అందమైన లోయ ప్రాంతాలు కళ్ల ముందు కదిలేవి... కానీ ఇప్పుడు... తుపాకీ గుళ్ల వర్షం... బంధువులను కోల్పోయిన వారి హాహాకారాలు... చిధ్రమైన జీవితాలు...బైసరాన్ పేరు చెబితే...ఇకపై ఇవే గుర్తుకొస్తాయి..!

Show Full Article
Print Article
Next Story
More Stories