లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవిపై మాట్లాడొద్దన్న జనసేన: మరో 5 ముఖ్యాంశాలు

లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవిపై మాట్లాడొద్దన్న జనసేన: మరో 5 ముఖ్యాంశాలు
x
Highlights

నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రకటనపై ఎవరూ స్పందించవద్దని జనసేన ఆ పార్టీ నాయకులకు సూచించింది.

1.లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవిపై మాట్లాడొద్దు: జనసేన

నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులు చేస్తున్న ప్రకటనపై ఎవరూ స్పందించవద్దని జనసేన ఆ పార్టీ నాయకులకు సూచించింది. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలనేది తమ కోరిక అని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ జనవరి 20న ప్రకటించారు. దీంతో ఈ విషయమై ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని టీడీపీ నాయకత్వం జనవరి 20న ప్రకటన విడుదల చేసింది. కడప జిల్లాో చంద్రబాబు పర్యటించిన సమయంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని కోరారు.

2.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు: కీలక నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డోనల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఉత్తర అమెరికాలో ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా వ్యవహరిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగింది. కృత్రిమ మేధ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు. చైనా కంపెనీ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ 75 రోజుల సమయం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు.

3.తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు

తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో, నివాసాల్లో జనవరి 21న ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ లో 55 బృందాలతో తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ లో దిల్ రాజ ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కూతురు హన్సిత రెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్ రాజు భార్య ను బ్యాంకు కు తీసుకెళ్లి లాకర్లను ఓపెన్ చేయించారు. ఐటీ అధికారులు బ్యాంకు వివరాలు అడిగారని ఆమె మీడియాకు చెప్పారు.

4.గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్‌సీ

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. 2025 మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్లు నిర్వహించనున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను డిస్కిప్టివ్ టైప్ లో నిర్వహిస్తారు.ఏపీలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.4,496 మందికి మెయిన్స్ కు అర్హత సాధించారు.

.5.సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని కోల్ కతా హైకోర్టులో బెంగాల్ సర్కార్ పిటిషన్

సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలని కోల్‌కతా హైకోర్టులో బెంగాల్ ప్రభుత్వం మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో సంజయ్ రాయ్ కు కోల్‌కతా షీల్దా కోర్టు జీవిత ఖైదును జనవరి 20న విధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories