Jyoti Malhotra: పాకిస్తాన్ కు గూఢచార్యం ఆరోపణపై అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ లోనూ జాడలు

Jyoti Malhotra, arrested on charges of spying for Pakistan, traces found in Hyderabad
x

Jyoti Malhotra: పాకిస్తాన్ కు గూఢచార్యం ఆరోపణపై అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా హైదరాబాద్ లోనూ జాడలు

Highlights

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కు...

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కు గూఢాచార్యం చేస్తుందన్న ఆరోపణలపై జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబర్ లో ప్రధాని మోదీ వర్చువల్ గా హైదరాబాద్ సికింద్రాబాద్ వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో జ్యోతి మల్హోత్రా చాలా హడావుడి చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో యూట్యూబర్ గా వీడియోలు చేస్తూ జ్యోతి హల్చల్ చేశారు. హర్యానాలో ఈ మధ్యే గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయ్యింది. అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియలోనూ వైరల్ అవుతున్నాయి.

అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా కలిస్తే అక్కడి వీడియోలను తీశారా అనే కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories