మరీ ఇంత దారుణమా? వంట చేయలేదని భార్యను చంపిన భర్త

మరీ ఇంత దారుణమా? వంట చేయలేదని భార్యను చంపిన భర్త
x

మరీ ఇంత దారుణమా? వంట చేయలేదని భార్యను చంపిన భర్త

Highlights

దేశం ఎటుపోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. చిన్న చిన్న గొడవలు హత్యలకు కారణాలు అయిపోతున్నాయి. ఉడుకురక్తం ఉన్న యువతీయువకులు అలానే ఉన్నారు.

దేశం ఎటుపోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. చిన్న చిన్న గొడవలు హత్యలకు కారణాలు అయిపోతున్నాయి. ఉడుకురక్తం ఉన్న యువతీయువకులు అలానే ఉన్నారు. విచక్షణా జ్నానం తెలిసిన 60ఏళ్లు దాటిన వాళ్లూ అలానే ఉన్నారు. క్షణికావేశంతో నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. భార్యతో వంట విషయమై గొడవపడి భర్త ఆమెను పీటతో కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులోని మాగడి తాలూకా మట్టికెరెలో తిమ్మమ్మ(65)ను, ఆమె భర్త రంగయ్య(68) దారుణంగా హత్య చేశాడు. వంట విషయమై వీరిద్దరికి గొడవ జరిగింది. తనకు నచ్చిన వంట చేయలేదని 65ఏళ్ల తిమ్మమ్మపై పక్కనే ఉన్న కొబ్బరి పీటతో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో తిమ్మమ్మకు తీవ్రంగా రక్తస్రావం జరిగి, అక్కడికక్కడే చనిపోయింది. అయితే ఈ హత్య తర్వాత రంగయ్య తిరుపతికి పారిపోతుంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, అదుపులోకి తీసుకున్నారు. రంగయ్యను పోలీసులు విచారించగా జరిగినదంతా చెప్పాడు. పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చిన్నపాటి గొడవకు కట్టుకున్న భార్యను హతమార్చడంతో స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తాయి. పోతాయి. అంతేగానీ, వాటిని పెద్దగా చేసుకుని హత్యల వరకు ఎందుకు వెళ్లడం. యుక్తవయసులో ఉన్నవారికి క్షణికావేశం అలాగే ఉడుకురక్తం ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తప్పులు ఎక్కువగా చేస్తుంటారు. కానీ 65 ఏళ్లు వచ్చిన వాళ్లకు కూడా ఎందుకంత కక్ష, పగ? ఎందుకంత క్షణికావేశం? ఈ క్షణికావేశంలో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories