ఓవర్ నైట్‌లో స్టార్.. అదే ఆమె పాలిట శాపమైందా..?

ఓవర్ నైట్‌లో స్టార్.. అదే ఆమె పాలిట శాపమైందా..?
x
Highlights

కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్‌ అయిన మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.

కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్‌ అయిన మోనాలిసా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు.కుంభమేళాకు వచ్చిన యూట్యూబర్లు, నెటిజన్లు ఆమెను వ్యాపారం చేసుకోనివ్వకుండా సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడ్డారు. బతుకుదెరువు కోసం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఇది ఇబ్బందిగా మారడంతో ఆమె ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.

ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోవడం అంతా ఈజీ కాదు.. కానీ ఓ పూసలు అమ్ముకునే ఓ పేదింటి అమ్మాయి విషయంలో అది జరిగింది. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. తను చేసే వ్యాపారానికి అడ్డంకిగా మారింది. దీంతో ఆమె తండ్రి ఆమెను ఇంటికి పంపించారు.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది భక్తులు త్రివేణి సంగమం వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కుంభమేళాలో పూసలు అమ్ముకునే ఓ యువతి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీ అని పిలుచుకుంటున్న ఈ అమ్మాయి పేరు మోనాలిసా భోస్తే. ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల ఈ అమ్మాయి నీలి రంగు కళ్లతో పూసలు అమ్ముకుంటూ కుంభమేళాకు వచ్చిన వారిని ఆకర్షించింది. దీంతో ఈ అమ్మాయికి సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా వైరల్ కావడంతో.. సోషల్ మీడియాలో ఓవర్ నైట్‌‌సెన్సేషన్‌గా మారింది. వీడియో ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు, అమాయకత్వం లక్షల మందిని ఆకర్షించింది. దీంతో ఇంటర్నెట్‌లో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. అయితే అదే ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసింది. కుంభమేళాకు వచ్చిన వారు, యూట్యూబర్లు ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. వ్యాపారం చేసుకోనివ్వకుండా జనం సెల్పీల కోసం ఎగబడడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారింది. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆమె వ్యాపారం కూడా దెబ్బతింది. దాంతో ఆమె తండ్రి ఇలా అయితే లాభం లేదని ఆమెను ఇంటికి పంపించేశారు.

ఆమె ఫోటోలను కొందరు నెటిజన్లు వైరల్ చేశారు. అది ఆమె వ్యాపారికి అడ్డంకిగా మారింది. మధ్య ప్రదేశ్ నుంచి మోనాలిసా ఫ్యామిలీ.. బతుకుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా..? అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పేదింటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి అంటూ మరికొందరు మోనాలిసాకు సపోర్టు చేస్తున్నారు. మరికొందరు ఆమె స్టార్ అవ్వడం ఏమోగానీ.. ఆమె వ్యాపారం దెబ్బతినడమే కాదు.. ఆమెను ఇంటి బాట పట్టేలా చేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories