Lok Sabha: పార్లమెంట్లో పశ్చిమాసియా సెగ.. యుద్ధంపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్సభ రేపటికి వాయిదా!

Lok Sabha: పార్లమెంట్లో పశ్చిమాసియా సెగ.. యుద్ధంపై చర్చకు విపక్షాల పట్టు.. లోక్సభ రేపటికి వాయిదా!
Lok Sabha Adjourned: పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది.
Lok Sabha Adjourned: పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ కోరగా.. పశ్చిమాసియా యుద్ధంపై చర్చించాలని ఎంపీలు పట్టుబట్టారు.
చర్చ జరగాలంటే సభా నియమాలను పాటించి నోటీసులు ఇవ్వాలని ప్యానెల్ స్పీకర్ సూచించారు. సభ్యులు విజ్ఞతతో ప్రవర్తించాలని... రోజుకు 9కోట్ల ప్రజాధనంతో నిర్వహిస్తున్న సభలో చర్చ జరగకుండా అడ్డుపడటం సరికాదని మండిపడ్డారు. అయినా వెల్లోకి వెళ్లి విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. దాంతో సభను రేపు ఉదయం పదకొండు గంటలకు వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



