పార్లమెంట్‌లో మాటల యుద్ధం: కిరణ్ రిజిజుపై విపక్షాల విమర్శలు.. అమిత్ షా 'స్ట్రాంగ్' కౌంటర్!

Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 10 March 2026 3:44 PM IST
పార్లమెంట్‌లో మాటల యుద్ధం: కిరణ్ రిజిజుపై విపక్షాల విమర్శలు.. అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్!
X

పార్లమెంట్‌లో మాటల యుద్ధం: కిరణ్ రిజిజుపై విపక్షాల విమర్శలు.. అమిత్ షా 'స్ట్రాంగ్' కౌంటర్!

Lok Sabha: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీరుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చేసిన వ్యాఖ్యలు, దానికి హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన కౌంటర్ సభలో వేడిని పెంచాయి.

అంతరాయం కలిగించే మంత్రి రిజిజు: గౌరవ్ గొగోయ్

చర్చలో భాగంగా గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుపై నిప్పులు చెరిగారు. "ప్రతిపక్షాలకు అత్యంత అంతరాయం కలిగించిన మంత్రిగా కిరణ్ రిజిజు చరిత్రలో గుర్తుండిపోతారు" అని ఆయన ఎద్దేవా చేశారు. విపక్ష ఎంపీలు మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా జోక్యం చేసుకుంటూ సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.

బాధ్యతారహితమైన ప్రతిపక్షం: అమిత్ షా కౌంటర్

గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. కిరణ్ రిజిజు జోక్యంపై ఆయన చమత్కరిస్తూనే విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. "మంత్రి కిరణ్ రిజిజు ఎక్కువగా అంతరాయం కలిగించారనే మాటతో నేను అంగీకరిస్తున్నాను.. కానీ, ఇంత బాధ్యతారహితమైన ప్రతిపక్షాన్ని నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు" అని అమిత్ షా ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష ఎంపీలు సభలో అసభ్యకరమైన లేదా పార్లమెంటరీ కానీ పదజాలం ఉపయోగించినప్పుడు మాత్రమే అధికార పక్షం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంటరీ నియమాలను ఎవరైనా ఉల్లంఘించినప్పుడు అడ్డుకోవడం మంత్రి బాధ్యత అని ఆయన సమర్థించుకున్నారు.

మొత్తానికి స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో లోక్‌సభలో చర్చా కార్యక్రమం ఆరోపణలు, ప్రత్యారోపణలతో అట్టుడుకుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story