Newly-Wed Wife Murdered Man: పెళ్లి కోసం ఆరాటపడిన వ్యక్తి.. పెళ్లైన కొన్ని రోజులకే హత్య చేసిన నవ వధువు

Newly-Wed Wife Murdered Man
x

Newly-Wed Wife Murdered Man: పెళ్లి కోసం ఆరాటపడిన వ్యక్తి.. పెళ్లైన కొన్ని రోజులకే హత్య చేసిన నవ వధువు

Highlights

Newly-Wed Wife Murdered Man: ఇంద్రకుమార్‌కు పెళ్లి జరిగిందని అంతా భావించిన వేళ, కొద్ది రోజులకే అతడు హత్యకు గురయ్యాడు.

Newly-Wed Wife Murdered Man: 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీ, జబల్‌పూర్ జిల్లా పద్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన రైతు. వ్యవసాయంతో పాటు పార్ట్ టైమ్ టీచర్‌గా కూడా పని చేస్తున్న ఇతను, మేలో ఓ ఆధ్యాత్మిక సభలో తనకు పెళ్లి కావడం లేదని, జీవితంలో ఒంటరిగా ఉన్నానని వాపోయాడు. ఈ ప్రసంగం సమయంలో ఇతని ఆవేదనపూరిత మాటలు వీడియోగా రికార్డ్ అయి వైరల్‌ కావడంతో అతడి జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.

ఈ వీడియోను చూసిన ఒక ముఠా అతడి వద్ద ఉన్న 18 ఎకరాల భూమిని కబ్జా చేయాలని కుట్ర పన్ని, ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెందిన సాహిబా బానో అనే మహిళ ‘ఖుషి తివారీ’గా నటించి సోషల్ మీడియాలో ఇంద్రకుమార్‌కు పరిచయమైంది. త్వరలోనే ఇద్దరి మధ్య సన్నిహితత పెరిగి, ఆమె పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఇక తాను పెళ్లి చేసుకోబోతున్నానని ఇంద్రకుమార్ ఆనందంతో కుటుంబానికి చెప్పి కుషినగర్‌కు బయలుదేరాడు.

ఇంద్రకుమార్‌కు పెళ్లి జరిగిందని అంతా భావించిన వేళ, కొద్ది రోజులకే అతడు హత్యకు గురయ్యాడు. నవ వధువుగా నమ్మించిన సాహిబా బానో, తన ముఠా సభ్యులతో కలిసి ఇంద్రకుమార్‌ను దారుణంగా హత్య చేసి, అతడి వద్ద ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలతో పరారయ్యారు.

జూన్ 6న, కుషినగర్‌లోని జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో ఇంద్రకుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడి మెడపై కత్తితో కోసిన గాయాలుండటంతో ఇది హత్యగా స్పష్టమైంది.

దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాహిబా బానో ‘ఖుషి తివారీ’ పేరుతో నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి, మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తుండగా, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును మధ్యప్రదేశ్ పోలీసుల సహకంతో కుషినగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories