TOP 6 News @ 6PM: మహా కుంభమేళాలో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం... భయంతో పరుగులు తీసిన భక్తులు

TOP 6 News @ 6PM: మహా కుంభమేళాలో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం... భయంతో పరుగులు తీసిన భక్తులు
x
Highlights

1) మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం Maha Kumbh mela fire accident: మహా కుంభమేళాలో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన...

1) మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం

Maha Kumbh mela fire accident: మహా కుంభమేళాలో సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో భక్తుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 70-80 గుడిసెలు, మరో 10 టెంట్స్ కాలి బూడిదయ్యాయి. ఉన్నట్లుండి మంటలు ఎగిసిపడటంతో మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు గట్టిగా కేకలు వేస్తూ దూరంగా పరుగెత్తారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన ఫైర్ ఇంజన్స్ ను రంగంలోకి దింపి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భక్తులు, అధికారులు అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

మహా కుంభమేళాలోని సెక్టార్ 19 లో ఉన్న టెంట్ సిటీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ బృందం (NDRF) బలగాలు, స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి తమ వంతు సహాయం చేశారు.

2) Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడికి పోలీస్ కస్టడీ విధించిన కోర్టు

Saif Ali Khan Attacker gets Police Custody: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌కు ముంబై కోర్టు 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది. జనవరి 15 నాడు అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్‌తో పాటు ఆ ఇంట్లో పనిచేసే సిబ్బందిని గాయపర్చారు. ఆ తరువాత వారి నుండి తప్పించుకుని పరారయ్యారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టిన ముంబై పోలీసులు మూడు రోజుల తరువాత థానెలో నిందితుడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి మారు పేరుతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్‌లో విజయ్ దాస్‌గా పేరు మార్చుకుని తిరుగుతున్నట్లు ముంబై పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి.

3) సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసి పారిపోయిన దుండగుడిని ముంబై పోలీసులు ఎలా పట్టుకున్నారు?

Saif Ali Khan case latest news: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశీయుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్. ఇండియాకు వచ్చి విజయ్ దాస్‌గా పేరు మార్చుకుని తిరుగుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడి, సైఫ్‌తో పాటు ఆయన చిన్న కొడుకు జహంగీర్‌కు కేర్ టేకర్‌గా ఉన్న ఎలియామ ఫిలిప్‌పై దాడి చేశారు. ఈ దాడి అనంతరం అక్కడి నుండి పారిపోయారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన దుండగుడిని అరెస్ట్ చేసేందుకు ముంబై పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మొత్తం 30 పోలీసు బృందాలు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

4) ICC Women’s U-19 T20 World Cup: భారత్ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో అద్భుత ఆరంభం

ICC Women’s U-19 T20 World Cup: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ అద్భుతమైన ఆరంభం చేసింది. వెస్టిండీస్‌పై 20 ఓవర్ల లక్ష్యాన్ని కేవలం 26 బంతుల్లోనే ఛేదించారు. దీనితో భారత్ వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ను ఘోరంగా ఓడించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నిక్కీ ప్రసాద్ నేతృత్వంలోని జట్టు మ్యాచ్ కొనసాగుతున్నంత సేపు ఆధిపత్యాన్ని కొనసాగించింది.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. కానీ, భారత బౌలర్లు సృష్టించిన విధ్వంసం కారణంగా.. 20ఓవర్లు పూర్తిగా ఆడలేకపోయారు. మొత్తం వెస్టిండీస్ జట్టు 13.2 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది టోర్నమెంట్ చరిత్రలో వారి అత్యల్ప స్కోరు. భారత్ నిర్దేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని 4.2 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి సాధించింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) Solar Car: ఎండతో నడిచే కారు.. కిమీకు కేవలం 80 పైసలే ఖర్చు

Solar Car: దేశ కార్ల పరిశ్రమలో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ కార్లలో కొత్తదనం కనిపిస్తోంది. ఇప్పుడు సోలార్ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో పూణేకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ వేవ్ మొబిలిటీ దేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచే కారు 'వేవ్ ఇవా'ను విడుదల చేసింది. 3 మీటర్ల లోపు ఉన్న ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షలు మాత్రమే. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

Vayve EVA సోలార్ కారు డిజైన్ గురించి చెప్పాలంటే అందులో అందించిన సోలార్ ప్యానెల్ కారు సన్‌రూఫ్ స్థానంలో ఉంటుంది. 1కిమీ ప్రయాణానికి కేవలం 80 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ పేర్కొంది. ఇందులో ముందు భాగంలో డ్రైవర్ సీట్ ఒకటే ఉంటుంది. వెనుక భాగంలో కొంచెం వెడల్పు సీటు ఉంది. డ్రైవింగ్ సీటును 6 రకాలుగా అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. ఇది కాకుండా, కారులో పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) Trump Coin: ట్రంప్ కాయిన్ ప్రకంపనలు..లాంచ్ అయిన కొన్ని గంటల్లోనే సంచలనం

Trump Coin: క్రిప్టో కరెన్సీ మార్కెట్లో ట్రంప్ కాయిన్ సంచలనం క్రియేట్ చేస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణా స్వీకారానికి ముందు లాంచ్ అయిన ఈ కాయిన్ కొన్నిగంటల వ్యవధిలోనే 300శాతం పెరిగి ఏకంగా 6.76 బిలియన్ డాలర్ల పీక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కు చేరింది. దీనిని ట్రంప్ కాయిన్ అని ట్రంప్ మీమ్ కాయిన్ అని పిలుస్తున్నారు. ఈ ట్రంప్ కాయిన్ మీమ్ కాయిన్ వాల్యూ అమాంతం పెరగడంతో ఇప్పడు అందరి చూపు దీని మీదే పడింది.

అసలీ ట్రంప్ మీమ్స్ అంటే ఏంటి? ఇవి ఇతర డిజిటల్ కరెన్సీల మాదిరిగానే ట్రంప్ మీమ్ కాయిన్స్ కూడా పనిచేస్తాయి. వీటితో ట్రాన్సాక్షన్లు, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేయవచ్చు. కాగా ఈ కాయిన్ శనివారం ట్రేడింగ్ కు రాగా హై 33.87 డాలర్లుగా నమోదు అయ్యింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories