Viral Video: పిచ్చి పీక్స్‌.. రోడ్డు మధ్యలో కూర్చొని టీ తాగుతూ రీల్‌, కట్‌ చేస్తే పోలీస్ స్టేషన్‌..!

Viral Video: పిచ్చి పీక్స్‌.. రోడ్డు మధ్యలో కూర్చొని టీ తాగుతూ రీల్‌, కట్‌ చేస్తే పోలీస్ స్టేషన్‌..!
x
Highlights

Drinking Tea On Road Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి విచిత్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్లకు ప్రధానంగా కావాల్సింది లైక్స్, కామెంట్స్ అయితే రీల్స్ చేస్తున్నవారు నేడు హద్దులు మీరుతున్నాయి. ఓ వ్యక్తి నడిరోడ్డుపై చైర్ వేసుకుని కూర్చొని టీ తాగుతూ ప్రమాదకరంగా రీల్‌ చేశాడు. దీంతో అతనికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు.

Drinking Tea On Road Viral Video: సోషల్ మీడియాలో వైరల్ కావడానికి విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఏకంగా వారి ప్రాణాల మీదకు కూడా తీసుకువస్తుంది. ఇటీవలే గంగా నదిలో యువతి స్నానం చేసే వీడియో తీయగా ఏకంగా కొట్టుకపోయి ప్రాణాలే కోల్పోయింది. మరి ఇంతమంది పైనుంచి స్టాంట్లు వేస్తూ దూకుతూ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక నడుస్తున్న రైళ్లతో సెల్ఫీలు దిగిన వారి సంగతి సరే ప్రాణాలు కోల్పోయిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిచ్చి పీక్స్‌కు చేరుతోంది. వైరల్ కావడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెంగళూరులో నడిరోడ్డుపై చైర్ వేసుకుని కూర్చొని వినూత్నంగా టీ తాగుతూ రీల్‌ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులతో అతని అదుపులోకి తీసుకొని గట్టి షాక్ ఇచ్చారు.

ఈ ఘటన బెంగళూరులోని మగడి రోడ్డులో ఈ నెల 12వ తేదీన జరిగింది. యువకుడు నడి రోడ్డుపై కుర్చీ వేసుకొని కూర్చొని హాయిగా టీ తాగుతూ రీల్స్ చేస్తున్నాడు. పక్క నుంచి ఆటోలు, పెద్ద పెద్ద వాహనాలు కూడా వెళ్తున్నాయి. అయినా కానీ ఏమాత్రం పట్టనట్టుగా వైరల్ అయ్యేందుకు రోడ్డు మధ్యలో వేసుకొని టీ తాగుతూ హాయిగా రీల్ తీయించుకున్నాడు. ఈ వీడియో ఎక్స్‌లో షేర్‌ చేయగా బెంగళూరు పోలీసుల వద్దకు చేరింది. ఈ నేపథ్యం పోలీసులు అతని ట్రాక్ చేసి వెంటనే అరెస్టు చేశారు. ఇలా ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సింది అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి ప్రమాదకర రీల్స్ చేస్తూ తమ ప్రాణాలను ప్రమాదంలో పడేయడమే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై తగిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories