Anil Menon: అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్

Anil Menon
x

Anil Menon: అంతరిక్షానికి మరో భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్

Highlights

Anil Menon: నాసా ప్రకటించిన తాజా అంతరిక్ష యాత్ర కోసం భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మీనన్ ఎంపికయ్యారు.

Anil Menon: నాసా ప్రకటించిన తాజా అంతరిక్ష యాత్ర కోసం భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్ మీనన్ ఎంపికయ్యారు. ప్రముఖ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) ప్రయాణంలో భాగంగా, ఆయన 2026 జూన్‌లో నాసా చేపట్టనున్న మిషన్‌లో భాగంగా అంతరిక్షానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ తర్వాత ఐఎస్ఎస్‌లో అడుగుపెట్టనున్న మరో ఇండో-అమెరికన్ వ్యోమగామిగా మీనన్ రికార్డు సృష్టించనున్నారు.

ఈ ప్రయాణంలో అనిల్ మీనన్ ‘రోస్కోస్మోస్‌ సోయజ్‌ ఎంఎస్‌–29’ అనే అంతరిక్ష నౌకలో ఫ్లైట్ ఇంజనీర్‌గా, అలాగే ఎక్స్‌పెడిషన్‌ 75 సభ్యుడిగా ఐఎస్ఎస్‌కు వెళ్లనున్నారు. ఈ ప్రయోగాన్ని కజకిస్థాన్‌ నుంచి ప్రయోగించనున్నట్టు నాసా వెల్లడించింది. అనిల్‌తోపాటు రష్యా వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, అనా కికినా కూడా ఈ మిషన్‌లో భాగం కానున్నారు.

ఈ ముగ్గురు వ్యోమగాములు దాదాపు ఎనిమిది నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొననున్నారు.

అనిల్ మీనన్ బయోగ్రఫీ:

అనిల్‌ మీనన్‌కు భారతీయ తండ్రి శంకరన్ మీనన్, ఉక్రెయిన్‌కు చెందిన తల్లి లీసా సమోలెంకో.

♦ ఆయన అమెరికాలో జన్మించి పెరిగారు.

♦ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ,

♦ మసాచుసెట్స్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్,

♦ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఏరోస్పేస్ మెడిసిన్‌ పూర్తిచేశారు.

♦ 2014లో నాసాలో ఫ్లైట్ సర్జన్‌గా చేరిన అనిల్,

♦ 2021లో నాసా వ్యోమగామి శిక్షణకు ఎంపికయ్యారు.

♦ మూడేళ్ల శిక్షణ అనంతరం 2024లో అధికారికంగా వ్యోమగామిగా పట్టభద్రులయ్యారు.

ప్రస్తుతం స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్న అనా మీనన్ అనిల్ భార్య. ఈ జంట అమెరికాలో స్థిరపడింది. అనిల్ మీనన్ విజయవంతంగా మిషన్‌ను పూర్తిచేస్తే, భారత సంతతికి చెందిన మరో ఘనతగల వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోతారు.



Show Full Article
Print Article
Next Story
More Stories