Sanjay Raut: సీజేఐ ఇంట్లో మోదీ పూజ‌.. అనుమానం వ్య‌క్తం చేసిన శివ‌సేన‌

Sanjay Raut: ఇక మాకు సీజేఐ న్యాయం చేస్తారో లేదో

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 12 Sept 2024 10:00 PM IST
Modi Visited Chandrachuds House For Ganpati Puja Shiv Sena Ubt Leader Sanjay Raut Doubts Whether Cji Will Deliver Justice To Them
X

Sanjay Raut: సీజేఐ ఇంట్లో మోదీ పూజ‌.. అనుమానం వ్య‌క్తం చేసిన శివ‌సేన‌

Sanjay Raut: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్‌ ఇంటికి వెళ్లి ప్రధాని మోడీ గణపతి పూజ చేయటంపై శివసేన నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన కేసులో సీజేఐ సరైన న్యాయాన్ని అందిస్తారో లేదో అని సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని... అందులో మరోపార్టీగా మోడీ ఉన్నారని.. సంజయ్ రౌత్ వెల్లడించారు. రాజ్యాంగానికి సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి.. రాజకీయ నాయకులను కలవడం ప్రజల మెదళ్లలో అనుమానాలు రేకెత్తిస్తోందని ఆరోపించారు.

తమ పార్టీకి చెందిన ఓ కేసులో కేంద్ర ప్రభుత్వమే ప్రత్యర్థి అని.. ఆ కేసు నుంచి చీఫ్ జస్టిస్ తప్పుకోవాలని.. రౌత్ తెలిపారు. ఆ కేసులో తమకు న్యాయం చేస్తారో లేదో అని సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహారాష్ట్రాలో అక్రమ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రధాని మోడీ చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story