Mumbai Lift Blast: ముంబయిలో షాకింగ్ ఘటన: లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థిని!

Mumbai Lift Blast: ముంబయిలో షాకింగ్ ఘటన: లిఫ్ట్‌లో పేలిన గ్యాస్ బెలూన్లు.. మంటల్లో చిక్కుకున్న విద్యార్థిని!
Mumbai Lift Blast: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పెను ప్రమాదం తప్పింది. గోరెగావ్ (వెస్ట్)లోని ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో లిఫ్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి.
Mumbai Lift Blast: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పెను ప్రమాదం తప్పింది. గోరెగావ్ (వెస్ట్)లోని ఓ అపార్ట్మెంట్లో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోవడంతో లిఫ్ట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వైద్య విద్యార్థినితో పాటు బెలూన్లు డెలివరీ చేసే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
గోరెగావ్‌లోని ఒక అపార్ట్మెంట్లో జరగనున్న వేడుక కోసం రాజ్‌కుమార్ మహతో అనే వ్యక్తి గ్యాస్ బెలూన్లను డెలివరీ చేయడానికి వచ్చాడు. అతను బెలూన్లతో లిఫ్ట్ ఎక్కగా, అదే సమయంలో హిమానీ అనే వైద్య విద్యార్థిని, మరో యువకుడు కూడా లిఫ్ట్‌లోకి ప్రవేశించారు. లిఫ్ట్ కదలకముందే, రాజ్‌కుమార్ చేతిలో ఉన్న బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లో లిఫ్ట్ అంతా మంటలు వ్యాపించాయి. భయంతో ముగ్గురూ బయటకు పరుగులు తీసినప్పటికీ, రాజ్‌కుమార్, హిమానీలు అగ్నికీలల వల్ల గాయపడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. బెలూన్ల దుకాణం యజమాని టీకే జైశ్వాల్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Science: Hydrogen is extremely inflammable, and it leaks in small volumes from balloons. A lift has static electricity as well as electronic components. Even a tiny spark can result in an explosion.
— THE SKIN DOCTOR (@theskindoctor13) February 4, 2026
So why do people buy them? Mostly, they don’t. They are victims of a scam. They… pic.twitter.com/Oijz9pbUnl

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



