Bus Accident: నదిలో పడ్డ బస్సు.. 18 మంది దుర్మరణం

Bus Accident: నదిలో పడ్డ బస్సు.. 18 మంది దుర్మరణం
x

 Bus Accident: నదిలో పడ్డ బస్సు.. 18 మంది దుర్మరణం

Highlights

Nepal Bus Accident: నేపాల్‌లోని ధాండింగ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

Nepal Bus Accident: నేపాల్‌లోని ధాండింగ్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలో పడటంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నది ప్రవాహం బలంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీస్ యంత్రాంగం తెలిపింది. ఈ ఘటనతో ధాడింగ్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories