New Baggage Rules 2026: విదేశాల నుంచి వచ్చే వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. మహిళలకు 40 గ్రా. .. పురుషులకు 20 గ్రా.. ఇక ఆభరణాలపై నో ట్యాక్స్!


New Baggage Rules 2026: విదేశాల నుంచి వచ్చే వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. మహిళలకు 40 గ్రా. .. పురుషులకు 20 గ్రా.. ఇక ఆభరణాలపై నో ట్యాక్స్!
New Baggage Rules 2026: విదేశీ ప్రయాణికులకు కేంద్రం తీపి కబురు! కొత్త 'బ్యాగేజీ నిబంధనలు 2026' అమల్లోకి వచ్చాయి. మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారు ఆభరణాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు.
New Baggage Rules 2026: విదేశాల నుంచి విమాన లేదా సముద్ర మార్గాల్లో భారత్కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2016 నాటి పాత నిబంధనలను సవరిస్తూ, ‘బ్యాగేజీ నిబంధనలు 2026’ను కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి తెచ్చింది.
బంగారు ఆభరణాలపై భారీ ఊరట: కొత్త నిబంధనల ప్రకారం, విదేశాల్లో ఏడాదికి పైగా నివసిస్తున్న భారతీయులు లేదా భారత సంతతి పర్యాటకులు తమ వెంట తెచ్చుకునే బంగారానికి కస్టమ్స్ సుంకం ఉండదు:
మహిళలు: 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు.
పురుషులు: 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలు.
గమనిక: ఈ మినహాయింపు కేవలం ఆభరణాలకు (Jewelry) మాత్రమే వర్తిస్తుంది. గోల్డ్ బిస్కెట్లు లేదా కడ్డీలు తెస్తే సుంకం చెల్లించాల్సిందే.
డ్యూటీ-ఫ్రీ పరిమితి పెంపు: విదేశాల నుంచి తెచ్చుకునే వ్యక్తిగత వస్తువుల విలువ పరిమితిని రూ.50,000 నుండి రూ.75,000కు పెంచారు. విదేశీ పర్యాటకులకు ఈ పరిమితి రూ.25,000గా ఉంది.
ఎలక్ట్రానిక్ వస్తువులు & ఇతరాలు:
♦ 18 ఏళ్లు దాటిన ప్రయాణికులు తమ వెంట అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ప్యాడ్ను సుంకం లేకుండా తీసుకురావచ్చు.
♦ మద్యం ప్రియులకు 2 లీటర్ల మద్యం, 100 సిగరెట్ల వరకు మినహాయింపు ఉంటుంది.
♦ శాశ్వతంగా భారత్కు తిరిగి వచ్చే వారికి (Transfer of Residence), వారు విదేశాల్లో ఉన్న కాలాన్ని బట్టి రూ.1.50 లక్షల నుండి రూ.7.50 లక్షల వరకు గృహోపకరణాలపై మినహాయింపు లభిస్తుంది.
ముఖ్యమైన హెచ్చరిక: సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. ఒకరి పరిమితిని మరొకరితో కలపడం లేదా పంచుకోవడం కుదరదు. అలాగే తుపాకులు, టీవీల వంటి వస్తువులకు ఈ మినహాయింపులు వర్తించవు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



